కుళలుఱవుత్యాగి 
               
 
 
నీలో ఉన్నాడు దేవుడు, అతనికి సేవ చెయ్యడమే నా ఆశయం !

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేస్వరి కృప
ఓం శ్రీ సద్గురువు కృప

కుశా తత్వం

భగవంతుడి నుండి ప్రసరించిన పలురకాల శక్తుల్లో సంఖ్యా శక్తి అనేదే ముఖ్యమైనది. ఒకటి నుండి తొమ్కిది వంకు ప్రస్తుతం ఆచరణలో వున్న అంకెలను గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో కఠినం. అక్షర శక్తి, సంఖ్యా శక్తులు భగవంతుని రెండు కళ్ళగా భావించబడుతున్నాయి. ఆ కారణాన భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకొన్నపారే సంఖ్యలను పూర్తిగా అవగాహన చేసుకోగలరు. అనవరతం భగవంతుని పాదకమలాలపై తమ ప్రాణాలు ఉంచినవారైన సిద్ధ వురుషులు మాత్రమే అంకెల శక్తులను పూర్తికా గ్రహించగలరు.
ఎక్కడా అంకెలే
నేటికి ప్రపంచంలో మనం చూస్తున్న అన్నీ వస్తువుల జీవరాశుల సృష్టికి, ఆధారానికి, స్థితికి, సంహారానికి, నిక్షిప్తానికి అని అన్నీ కార్యాలకు సంఖ్యా శక్తులే కారణం అవుతాయ.
ఒక సాధారణ మనిషికి ఒక్క అంకె గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే కనీసం 20 ఏశ్ల కాలం అవుతుంది. సద్గురువుని అనుగ్రహం లభిస్తేనే సంఖ్యా శక్తిని వూర్తిగా అవగాహనం చేసుకోగలము. అయన చెప్పే ఆచరణ విధి విహితాలను నిర్వర్తించడమూ అవసరం.
సద్గురువు గురించి ఏదీ తెలియని వారి గతి ఏమిటి? అలాంటి వారుకు సిద్ధ పురుషులు అపార కరుణతో పలు సులభమైన పద్ధతులను ఇచ్చి ఉన్నారు.

  1. భగవంతుని వలె వేదాలూ అనాదివి. రుగ్, యజూర్, సామ, అథర్వణ వేదాలు భగవంతుని కళ్ళని చెప్పబడుతున్నాయి. అన్నీ వేద మంత్రాలు సంఖ్యా శక్తితో నిండి వున్నాయి. వేద మంత్రాలను గానం చేయగా చేయగా సంఖ్యా శక్తులను పొందకలగడం. విశేషంగా, సామ వేద మంత్రాలను గానం చేయడంవల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. మన వూరివీకులు ఒక రోజు కూడ తప్పకుండా వేద మంత్రాలను గానం చేసే ఆచరణ కలిగివున్న కారణాన వారు దీర్ఘ అయువు, శాంతి, అనందాలతో జీవించారు.
  2. ప్రతి దైవమూర్తుల కల్యాణ గుణాలను వర్ణించే నామాలు 108, 300, 1008 అనే లెక్కలో ఉన్నాయి. వీటినే ఆ దైవమూర్తుల అష్టోత్ర శత నామ స్తోత్రాలు, త్రిశతి, సహస్ర నామ స్తోత్రాలని చెప్తాము. ఈ నామాలను ఉచ్చరిస్తూ సుగంధ పువ్వులతో దైవమూర్తులను అర్చించి ఆరాధిస్తూ ఉంటే సంఖ్యా శక్తులు త్వరగా కుదురుతాయి.
  3. మన చేతి వేళ్ళలో మూడు భాగాలు ఉన్నాయి. ఈ భాగాలను చూపించే గీతలను అంగుళాస్ధితి అంటారు. ఈ అంగుళాస్థితి మీద బొట్టన మునివేలను ఉంచి లెక్కించే అలవాటు ఉంది. ఈ అలవాటను చేగొని రామా, కృష్ణా, గోవిందా, వినాయకా, శివా అని దైవ నామాలను జపిస్తూ ఉంటే సంఖ్యా శక్తులు పెరుగుతాయి.

ఇటువంటి పూజా కార్యక్రమాల ద్వారా పామరులు కూడా సులభంగా సంఖ్యా శక్తులను గ్రహిస్తారు.
ఒక్క అంకె గూర్చిన జ్ఞానాన్ని పొందడానికే 20 ఏశ్శ కాలం కావాలంటే అన్నీ అంకెలను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఎంత కాలం అవుతుంతో. అందుచేత మానవులు కనీసం ఒక లేదా రెండు అంకెల గురించి చక్కగా అవగాహనం చేసుకోవడం అవసరం.
ప్రతి ఒకరికి తాను పుట్టిన తేదీ, ఇంటి సంఖ్య, మొబైల్ ఫోన్ నంబర్, తన భార్య, పిల్లలు పుట్టిన తేదీ, తన సద్గురువుగారి జన్మ తేదీ అని ఎన్నో సంఖ్యలు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం ఎటువంటి సంఖ్యలను ఎంచుకోవటం మంచిది అని చూద్దాం.

ఒకరు తన పుట్టిన తేదీ, విధి సంఖ్య, పుట్టిన వారం సంఖ్య, పుట్టిన నక్షత్ర సంఖ్య, తన  పేరు సంఖ్య, ఇత్యాదులో ఒకణ్ణి ఎంచుకోగలరు. ఉదాహరణకు, మీ పుట్టిన తేదీ మంగళ వారం, మఘ నక్షత్రం 12 మే మాసం 1981 అంటే, మీ పుట్టిన సంఖ్య 3 అవుతుంది. (1+2=3). మీ విధి సంఖ్య (1+2+5+1+9+8+1=27=9) 9. మీ పుట్టిన వారం సంఖ్య 9. మీ పుట్టిన నక్షత్ర సంఖ్య 7 లేదా 5. మీ పేరు రామూడు అంటే మీ నామం యొక్క సంఖ్య (RAMUDU = 2+1+4+6+4+6=23=2+3=5) 5 అవుతుంది. ఈ ప్రకారం మీరు 3, 9, 7, 5 అనే సంఖ్యలో ఏదైనా ఎంచుకోగలరు. తన భార్య, బిడ్డలు వుట్టిన తేదీ, ఇవీ కూడా ఏంచుకోవటం మంచిది. అలాగే తన ఇష్ట దైవానికి తగిన సంఖ్య, తన ఇష్ట దైవం అవతరించిన సంఖ్య, తన సద్గురు పుట్టిన తేదీ సంఖ్య, ఇవి కూడా అనుకోగలరు.

ఈ విధంగా తగిన సంఖ్యలను ఎంచుకున్న తరువాత ఆ సంఖ్యను తన జవితంలో విడవకుండా ఉపయోగించాలి. తన పూజ ప్రార్ధనల్లో ఆ సంఖ్యను ప్రయోగం చేస్తూ ఉండాలి.
ప్రయోగం ఎలా చెయ్యాలి?
పైన చెప్పిన ఉదాహరణ తీసుకోండి. మే మామం 12 తేదీ పుట్టిన వ్యక్తి తన పుట్టిన తేదీ యెక్క సంఖ్య అంటే మూడు అనే సంఖ్యను తన ప్రయోగ సంఖ్యగా ఎన్నుకుంటే అతడు ఎలా మూడును ప్రయోగం చెయ్యాలనే వివరణ ఈ ప్రకారం ఉంటుంది.

  1. మూడు కళ్ళు గల శివుని అనునిత్యం ఆరాధించటం. మూడు సంఖ్యకు తగిన పసుపు రంగులో వున్న సుగంధ పసిడి పువ్వులతో అర్పించి స్తోత్రం చేయటం.
  2. రొట్టె, చప్పాత్తి, పండ్లు, మిట్టాయిలు అని తిండి తిప్పలను అన్నదానం చేస్తున్నప్పుడు 3, 12, 30, 300 అని మూడు సంఖ్య లెక్కలో వచ్చే వధంగా దానం చేయటం మంచిది.
  3. చాలినంతవరకు మూడు సంఖ్యకు తగిన ఉత్తర దిక్కు కేసి నిలబడటం, కూర్చుండటం, వ్రాయటం, చదవటం మంచిది.
  4. ప్రతి రోజుకు దగిన దుస్తులు గురించి సిద్థులు వివరిస్తున్నారు. అ విధంగా దుస్తులను ధరించటంవల్ల మన కార్యాల్లో జయం వస్తుంది. ప్రస్తుతం ఆహార పతార్థాల్లో ఎక్కడ చూసినా కల్తీ కానవస్తుంది. పైగా రసాయణ ఎరువు, పురుగుల సంహారిణి వంటి వస్తువుల చేర్పులతో అన్నం మనకు అంత జీవ శక్తిని ఇవ్వలేదు. అటువంటి రసాయణ పదార్థాలు మన శరీరంలో వున్న జీవ శక్తిని తగ్గించి పలురకాల అంటు వ్యాధులను తెస్తాయి. రంగులను ఎవరూ, శాస్త్రాలేవీ మార్పు చెయ్యవు.

రోజు       వస్త్ర రంగు
ఆది వారం     ఆరంజి లేతా గులాబి
సోమ వారం  చాలా తెలుపులో కొద్దిగా ఎర్ర
చారలు లేదా పువ్వులు
మంగళ వారం  రక్త ఎరుపు
బుధ వారం      ఆకు పచ్చ
గురు వారం    పసుపు
శుక్ర వారం ఆకాశ నీలం
శని వారం       నలుపు లేదా ముదురు నీలం

డబ్బు ఇచ్చేటప్పుడూ తీసేటప్పుడూ మూడు సంఖ్య వచ్చే విధంగా ప్రవర్తించాలి. అంటే, ఒకరికి 1500 రూపాయిలు ఇవ్వాలనుకుంటే, వారికి మూడు 500 రూపాయిల నోట్లను ఇవ్వండి. మరో విధంగా, మొదట 1200 రూపాయిలు ఇయ్యండి.

అందువల్ల ఆ రూపాయిల సంఖ్య మూడుగా వస్తుంది గదా. తరువాత బాకి 300 రూపాయిలు ఇయ్య వచ్చును.

శుభ కార్యాల ముహూర్త కాల నిర్ణయంలో ప్రబలారిష్ట యోగం, తిథి శూన్యం వంటి అంశాలను తప్పకుండా గమనించాలి. అప్పుడు మూడవ తేదీ, మూడు గంటలు వంటి వాటిని దానితో చేర్చడానికి ప్రయత్నం చెయ్యాలి. ఉదాహరణకు ఒక శుభ కార్యం ఆరు గంటల నుండి 7.15 వరకు జరుగుతుంది అండే, దాన్ని 6.06 – 7.14 అని నిర్ణయం చేయడం వల్ల మూడు సంఖ్యా శక్తులు ఆ ముహూర్త కాలం పాటు తప్పకుండా ఇమిడి పోతాయి.

మూడు సంఖ్యా శక్తిని ప్రసరించగల మూర్తులను, వస్తువులను ఆరాధించడం కూడా మంచిదే. ఉధాహరణం, దక్షిణామూర్తి (గురువు సంఖ్యా కాబట్టి), శూలం, కొబ్బరి కాయలు, నెల పొడుపు, పూండి స్వామి వలె చిన్ముద్రను థరించిన మహనీయలు, దైవ మూర్తులను ప్రార్థించడం శుభకరం.

మూడు నదుల సంగమ చోటులకు తీర్థ యాత్ర చేసి అక్కడ మన శక్తికి తగిన దాన ధర్మాలను నిర్వర్తించడం ఉత్తమం. ఉదాహరణం - ఈరోడు తగ్గిర భవాని, తిరుచి లాల్గుడి తగ్గర నత్తం, అలహాబాదు త్రివేణి సంగం.

ఈ ప్రపంచంలోని వస్తువులను మంచివి గాని చెడ్డవి గాని రూఢిగా విభజించ లేము. సాధారణంగా మంచి వస్తువు అనుకొంటే దాన్ని చెడు కార్యానికీ, చెడు వస్తువు అనుకొంటే దాన్ని మంచి కార్యానికి ఉపయోగించడం సహజం. పునీతమైన విభూతి, నిమ్మ పండ్లు, నీళ్ళ వంటివి చేతబడి, బాణమతి, మద్యం వంటి కార్యాలకు పనికొస్తాయి. పాము గరశం చేత మనిషిని కాపాడే ఔషధాలు తయారు చేస్తారు. అంతే గాక ఒక వస్తువును వాడే ఉద్దేశ్యం మేరకు దాని గుణంలోను మార్పు ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఒక కత్తి తీసుకొందాం. దాని చేత ఒక మామిడి పండును కోసి పేదవాడికి ఇవ్వగలం లేదా ఏదైనా తగని పని చెయ్యవచ్చును.

పూర్తిగానే మంచి ఫలితాలను మాత్రమే ఇవ్వగల వస్తువు ఏమైనా ఉన్నదా అనే ప్రశ్నకు నిశ్చయంగా ఉంటుందని జవాబిస్తారు శ్రీలశ్రీ వెంకటరామ స్వామివారు. కుశం అనే ఒక సాటిలేని అద్భుత శక్తిని ఈ ప్రపంచ క్షేమం కోసం అర్పిస్తున్నారు తిరుకయిలాయ పోదియముని పారంపర్యానికి 1001వ గురు మహా సన్నిదానం శక్తి శ్రీ అంగాళ పరమేశ్వరి బానిస శ్రీలశ్రీ వెంకటరామ స్వామి వారు.

సిద్ధుల చేత అందించబడిన ఈ కుశా శక్తి మంచి మాత్రమే కలిగించేది. భవిష్యత్తులో అత్యావశ్యక వస్తువుల ఖరీదు సాధారణ మనిషులు కొనకోలుచాయని స్తాయికి పెరిగిపోతుంది. ఆ పరిస్థితిలో ఆహారానికి కావలసిన వస్తువులను కూడా సంపాదించని పేదవారికీ మధ్య తరగతి వారికీ సహకరించగల నిధులే సిద్ధుల రహస్యమైన కుశా తత్వం అవుతుంది.

ఈ కుశా తత్వంలోని అద్భుతం ఏమిటంటే దాన్ని ప్రయోగం చేయడానికి మంత్రాలేవీ చెప్పనక్కర లేదు. ఓ క్షణంలోనే ఈ తత్వాన్ని అర్థం చేసుకోగలం. ఎవరికి తెలియక గాని ఈ కుశా శక్తిని ప్రయోగం చేయవచ్చును. సముదాయంలోని అన్నీ రకాలవారూ, పలురకాల రంగంలో రాణిస్తేవారూ వారి వారి వాతావరణం బట్టి దాన్లో మార్పులు చేసుకోవడమూ సులభమే.

తన సద్గురువుగారి వద్ద ఉండి ఎన్నో కఠోర తపస్సులను, సాధనానుష్టాలను నిర్వర్తించి పలు సంవత్సారాల పాటు తన శరీరం మనసు ప్రాణం అన్నిటిని వారి సేవల కొసం అర్పించి ఈ కుశా తత్వాన్ని నేర్చుకోని పరోపకారార్థం అనుగ్రహించి ఉన్నారు శ్రీలశ్రీ వెంకటరామ స్వామి వారు.

కుశా తత్వంలో లక్షం పద్దతులకు ఎక్కువగా సిద్ధులు పేర్కొన్నారైనా వాటి నుండి కలియుగ మానవాళి కోసం 1008 పద్దతులు మత్రమే శ్రీలశ్రీ వెంకటరామ స్వామి వారు అనుగ్రహిస్తారు. వాటినుండి కొన్ని మాత్రం ఇక పేర్కొంటాము.

కుశా సంఖ్యా శక్తి - మొదటి తత్వం

ఒకటి, రెండు, మూడు అనే క్రమంలో తొమ్మిదికి తదుపరి పదికి ముందు వచ్చేది కుశం.

ఈ మొదటి తత్వాన్ని ఎలా ప్రయోగం చేయాలి ?

లెక్కించగల వస్తువులను లెక్కించేటప్పుడు ఒకటి, రెండు, మూడు ... అని లెక్కించుకొంటూ పదవ వస్తువుకు రాగానే "పది" అనక "కుశం" అని బిగ్గరగా గాని మనసులో గాని ఉచ్చరించి లెక్కించాలి.

ఉదాహరణకు మీ వద్ద పది మామిడి పళ్ళు ఉంటే వాటిని వరుసగా పెట్టి ఒకటి, రెండు, మూడు ... అని లెక్కించుకొంటూ పదవ మామిడికి రాగానే పది అనక కుశం అని చెప్పాలి. కుశం అనే మాటను నోరు తెరిచి గాని లోలోన గాని లెక్కించ గలరు.

ఇక కుశం అనేది ఒక సిద్ధ వేద ప్రయోగ మాట అవుతుంది. దాన్ని ఏ మతానికి చెందినవారూ, జాతి కుల మత వివక్షణ లేకుండా ప్రయోగం చేయ్య వచ్చును.

కుశం అనేది జాతి మత కుల బేధాలకు అతీతమైన ఒక సిద్ధ వేద ప్రయోగ పద్దతి అవుతుంది. దాన్లో ఎటువంటి మంత్ర, తంత్ర ప్రయోగాలను చేర్చనక్కర లేదు.

ప్రయోజనాలు

ఇలా లెక్కించడం చేత కలిగే ప్రయోజనం ఏమిటి ?

కుశా ప్రయోగం వల్ల వచ్చే ఫలాలను కేవలం మాటలతో చెప్పడం కంటె శ్రీలశ్రీ వెంకటరామ స్వామి వారు తామే నిర్వర్తించి చూపిన పద్దతిని ఇక వివరిస్తాము.

ఒక సారి మన ఆశ్రమంలోని హాల్లో పది ట్యూబ్లైట్లు బిగించ వలసింది. అప్పుడు శ్రీలశ్రీ స్వామివారు ఎవరికి తెలియకుండా పది ట్యూబ్లైట్లను ఒక మేజ మీద వరుసగా పెట్టి, వాటిని ఒకటి, రెండు, మూడు ... కుశం అని లెక్కించి పెట్టి వేశారు.

విద్యత్ పనులు చేస్తున్న ఒక సేవకుని వద్ద ఆ దీపాలను ఇచ్చి ఎక్కడెక్కడ వాటిని వేలాడ దీయాలని వివరిస్తారు. స్వామివారు చెప్పినట్లే ఆ సేవకుడు కూడా దీపాలను బిగించుకుంటూ ఉన్నాడు.

ఒకటి, రెండు ... అని బిగిస్తూ వస్తున్నప్పుడు పదవ దీపాన్ని పెట్టాలనుకొన్నప్పుడు, ఆ పదవ దీపంతో ఎక్కువగా వెలుగు రాదు, ఈ తొమ్మిది దీపాలే చాలు అనే నిర్ణయానికి వచ్చాడు. అందువల్ల ఒక దీపం మిగిలి పోయింది.

పని పూర్తి అయ్యాక స్వామివారికి వివరం తెలిపాడు. స్వామివారు హాలుకు వచ్చి చూడగా సేవకుడి ఆలోచన సరిగానే తోచింది. ఆ తొమ్మిది దీపాలు పది దీపాల వెలుగును ఇచ్చేశాయి.

శ్రీలశ్రీ స్వామివారు సేవకుడితో ఆ పదవ దీపాన్ని పెట్టమని చెప్పారు. దానికి సేవకుడు, "వాద్యారా ! ఈ చోటుకు పదవ దీపం బిగించడంవల్ల విశేషంగా వెలుగు రాదు. తొమ్మిది దీపాలే చాలు అనేది నా ఆలోచన. అయితే మీరు కోరితే ఆ పదవ దీపాన్నీ పెట్టుతాను," అన్నాడు. స్వామివారు అతడి మాటను అంగీకరించారు.

ఇదే కుశా శక్తిని అద్భుత ప్రభావం. మన మామూలైన జీవితంలో పది శాతం ఖర్చు, వస్తువులు తగ్గి పోతాయి అంటే ఒక మధ్య తరగతివారికి అది గొప్ప సహాయం కదా.

అన్నదానమూ కుశా తత్వమూ

మన ఆశ్రమంలో ఎప్పుడూ మందార ఆకుల్లోనే అన్నదానం ఇవ్వడం రివాజు. దానికి పలు కారణాలున్నాయి. మనం వెచ్చగా ఉన్న పొంగలి, పులవు, బిరింజి వంటి వాటిలో ఏలకాలు, లవంగం, పచ్చకర్పూరం, జాజికాయలు వంటి వాటిని చేర్చి వంట చేయడం వల్ల ఇతర ఆకుల్లో అన్నం పెట్టితే ఆకుల రసాయన మార్పులు ఆ సువాసన పదార్థాల గుణాన్ని కూడా మార్చుతుంది. కాని మందార ఆకుల విశిష్టత ఏమిటంటే వాటిలో ఎంత వెచ్చగా ఉన్న ఆహారాన్ని పెట్టినా దాని గుణం, వాసన, రుచి, రసాయణ స్థితిలో ఎటువంటి మార్పులు కావు. అంతేగాక ఆహారం ఆరగించిన తరువాత ఆ ఆకులను పారవేస్తే వాటిని తినే ఆవులు మేకలు ఎంతో సంతోషిస్తూ తినే విధంగా పచ్చిగానే ఉంటాయి.

మందార ఆకుని దైవీ గుణాలు

మందార ఆకును కుట్టూ ఆకు అనీ పిలుస్తారు. శివుని చేతులో అంటుకొన్న బ్రహ్మ యొక్క కపాలానికి శాప విమోచన కలిగించడానికి శివుడు పలు స్థలాలకు వెళ్ళి బిక్షం అడిగి పలు దైవీ లీలలు చేశాడు గదా ? మన ఆశ్రమంలోను ఆ బిక్షం అడిగిన దైవీ సంఘటనను స్మరించే విధంగా అన్నదాన కైంకర్యాలు చేపడతాయి.

పలు ఆకులను చేర్చి కుట్టిన కారణంతో మందార ఆకు కపాల పాత్రం అనే పేరు పొంది శివుని చేతిని ఆశ్రయించి బ్రహ్మ కపాలంగా అనుగ్రహాలను అపరిమితంగా వర్షిస్తుంది.

ప్రాణం వదిలినా సేవ వదలదు

పరోపకారార్థం ఎక్కడయితే వేల మంది వారికి తగ్గకుండా అన్నదానం ఇవ్వబడుతోందో అక్కడకి వేయిన్నొకటి భక్తుడుగా ఒక మహాత్ముడు ప్రసాదం తీసుకొంటారు అనేది భగవత్ నియతి. ఈ నియతిని పాటించే విధంగా తిరుఅణ్ణామలై పునీత భూమిలో అన్నదానం జరుగుతున్న సమయంలో లెక్కలేని జ్ఞానులూ, యోగులూ, సిద్ధులూ ప్రసాదం అందుకొని అన్నదానం చేసే సేవకులకు తమ అనుగ్రహాలను వర్షిస్తారు. అటువంటి ఉత్తములు స్వీకరించిన ప్రసాద ఆకులు ఎండి పోయాక వాటిని ఇతర ఆకులతో చేర్చి నిప్పులో ఆహూది వలె అర్పిస్తారు. అప్పుడు ఓ అద్భుత సంఘటన జరుగుతుంది.

విరోధాన్ని తొలగించే పంగాళి చెట్టు

తిరుఅణ్ణామలైలో ఒక్కొక్క క్షణమూ పలువిధమైన అద్భుతమైన మూలికలు, మొక్కలు పెరుగుతాయి. పంగాళి చెట్టు అనేది సిద్ధుల పరిభాషకి చెందిన ఒక మూలిక చెట్టు. చంద్రుడు మూల నక్షత్రంలోకి ప్రవేశించే సరికి మొలకెత్తి, మూల నక్షత్ర కాలం పాటు తిరుఅణ్ణామలైలో సేవలు చేసి చంద్రుడు మూల నక్షత్రం నుండి పూర్వాఆషాఢ నక్షత్రంలోకి ప్రవేశించేసరికి ఎండి పోయి నేలకింద నిక్షిప్తమవుతుంది.

ఈ చెట్టుల విశేష శక్తి ఏమిటంటే తిరుఅణ్ణామలై చుట్టువున్న గిరి ప్రదక్షిణ మార్గంలో వెళుతూ ఉన్న ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు గిరి ప్రదక్షిణం చేస్తున్న భక్తుల ఊపిరుల నుండి వెల్వడే కార్బన్-డై-ఆక్సైడు, కార్బన్ మోనాక్సైడు వంటి ప్రాణానికి ఆపద కలిగించే విష వాయువులను పీల్చుకొని ఆమ్లజని అనే పరిశుభ్రమైన వాయువును పంపుతాయి.

మూల నక్షత్రం సమయం మాత్రమే నేల మీద ప్రకాశించే ఈ అద్భుత మూలికలను కౌగిలించి వస్తున్న పవనాలు గిరిప్రదక్షిణం చేస్తున్న భక్తులను తాకి పోతే ఆస్త్మా వంటి శ్వాస నాళం, ఊపిరితిత్తుల రోగులూ, దంపతుల మధ్య కలిగే తగవులూ, సోదరులు, సోదరాలు, బంధువుల మధ్య వచ్చే సొత్తు తగవులూ తీరుతాయి.

మహాత్ముల సేవలు

ఈ అద్భుతమైన పంగాళి చెట్టులకు కావలసిన జీవ శక్తిని కలిగించగల శక్తి మహాత్ముల ప్రసాదాకులను మంట పెట్టినప్పడు దాని నుండి వెల్పడే హోమ పొగ ద్వారా ప్రాప్తిస్తుంది. ఈ విధంగా తిరుఅణ్ణామలైకి చెందిన వాతావరణానికీ అక్కడకి గిరిప్రదక్షిణం చేస్తున్న భక్తుల హృదయ స్వచ్చతకూ సహకరించేదే మందారాకుల్లో ఇవ్వబడుతున్న అన్నదానం అవుతుంది.

ఈ మందార ఆకులను యాబై యీబైగా కట్టి అన్నదానం కోసం ఉపయోగించటం మా ఆశ్రమంలోని రివాజు. ఒక పౌర్ణమి అన్నదానం సమయం ఈ ఆకుల పది కట్టులను అంటే 500 ఆకులు ఇచ్చి అన్నదానం చేయమని చెప్పారు శ్రీలశ్రీ స్వామివారు.

అన్నదానం పంచినప్పుడు వాటిలో కొన్నిలో కుట్టులు విప్పి పోయి, కొన్నిలో రంధ్రాలు పడి, కొన్నిలో పురుగుల కాటుల వంటి కారణాన ఒక ఆకుకు బదులుగా రెండు ఆకులను ఒకే భక్తుడికి ఇవ్వాల్సి వచ్చింది. అందుచేత 400 భక్తులకు అన్నదానం ఇవ్వక ముందే 500 ఆకులూ తీరిపోయాయి. అప్పుడు మళ్ళి 100 ఆకులను తెచ్చి అన్నదానాన్ని పూర్తి చేశారు.

మరొకసారి ఇలా అన్నాదానం ఇవ్వాల్సిప్పుడు శ్రీలశ్రీ స్వామివారు ముందుగా ఆ చోటకు వచ్చి పది మందార ఆకు కట్టులను ఒక మేజ మీద వరుసగా పెట్టి ఆ పది కట్టులను ఒకటి, రెండు, మూడు .... తొమ్మిది, కుశం అని లెక్కించారు. అలా కుశా శక్తితో నిండి పోయిన 500 ఆకులను అన్నదానం పంచడానికి ఇచ్చారు శ్రీలశ్రీ స్వామివారు.

ఆ ఆకులు ఎలా పనికి వస్తుందో చూసి పెట్టమని సేవకుల కొందరితో చెప్పాడు శ్రీలశ్రీ స్వామివారు. అప్పడు ఎంతో రుచికరమైన సంభవాలు జరిగాయి.

గిరి ప్రదక్షిణం వస్తున్న ఒక భక్తుడుకు అన్నదానం ఇవ్వబడింది. తదుపరి నిలుచిన భక్తుడుకూ దానం ఇవ్వబోతున్నారు. అప్పుడు ఆ రెండవ భక్తుడు మొదటి వాడిని చూపి, "వీరు నా మిత్రుడే. అందుచేత నాకు ప్రత్యేకంగా ఒక ఆకు ఇవ్వనక్కర లేదు. అతడి ప్రసాద ఆకులోనే మా భాగం కూడూ ఇవ్వండి. మనమిద్దరూ దాన్ని పంచుకొందాం," అన్నాడు. దాంలో ఒక్క ఆకులో రెండు భక్తుల ప్రసాదం ఇవ్వబడింది.

కాస్త సేవు అయ్యాక అరుగురు మంది గల ఒక కుటుంబం వచ్చింది. వారి మధ్య నుండి ఒకరు ముందుకు వచ్చి, "స్వామి, మనం అరుగురు మంది ఉన్నాము. కాని రెండు ఆకుల్లో అందరికి ప్రసాదం ఇస్తే చాలు. మేము పంచుకొంటాము," అన్నాడు. ఈ విధంగా పలు భక్తులు వారి మధ్యలోనే పంచుకొవడం వల్ల 400 మందార ఆకులతో ఐదు వందలకి పైబడిన భక్తులకు అన్నదానం ఇవ్వగలిగింది.

ఇలా కశా శక్తిని మహిమను అనుభవ పూర్వంగా వివరించారు శ్రీలశ్రీ స్వామివారు.

కుశా శక్తి - రెండవ తత్వం

నాలుగుగా పెరిగి రెండ్లో లయమవడం కుశం.

వివరణ :

ఒక పదార్థాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని రెండు భాగాల్లో వేస్తే ఆ నాలుగు భాగాల్లోనూ కుశా శక్తులు ప్రకాశిస్తాయి.

ప్రయోగ పద్దతి :

మిక్కిలి ప్రయోజనాలు కలిగి ఉన్నది ఈ రెండవ తత్వం. నాలుగు మెట్టుల్లో ఈ రెండవ తత్వాన్ని ప్రయోగంచాలి. ఇక్కడ వివరిస్తున్న ఒక్కొక్క మెట్టును చక్కగా గమనించి తెలుసుకోండి.

ఇప్పుడు మీ వద్ద నాలుగు 500 రూపాయిల నోటు ఉన్నాయి అనుక్కోండి.

మొదటి మెట్టు :

మొదట నాలుగు నోట్ల నుండి రెండు నోట్లు మాత్రం తీసుకొని వాటిని ఒక దాని పక్కన ఒకటిగా పెట్టండి.

రెండవ మెట్టు :

బాకి రెండు నోట్లను మొదటి వరుస కింద పెట్టండి.

మూడవ మెట్టు :

రండవ వరుసలోని నోట్లను ఒక్కసారిగా చేర్చండి.

నాలుగవ మెట్టు :

మొదటి వరుసలోని నోట్లను ఒక్కసారిగా చేర్చండి.

ఇప్పుడు మొదటి వరుసలోని రూపాయిలను ఖర్చు చేయండి. ఆ వేయి రూపాయిలు ఖర్చయన తరువాత రెండవ వరుసలోని రూపాయిలను ఖర్చు చేయండి.

ఇలా ఖర్చు చేస్తేనే ఇంతవరకు మీ ఖర్చు చేసిన రూపాయిలకూ ఇప్పుడు ఈ కుశా శక్తితో నిండిన రూపాయిలను ఖర్చు చేయడానికీ ఉన్న తేడా కనిపిస్తుంది. కుశా శక్తి పొందిన డబ్బు తప్పకుండా మంచి కార్యాల కోసమే పనికి పస్తుంది. పైగా వస్తువులు వ్యర్థత కాకుండా డబ్బులు వ్యర్థత కాకుండా మీ అన్ని ఖర్చులు ఆదాయానికి లోపలే ఇమిడి పోతాయి.

జీతముగా వచ్చిన డబ్బు, బ్యాంకులో చేల్లించే డబ్బు, ఇతరులనుండి అప్పు రూపమై వచ్చిన డబ్బు, ఇతరులకు అప్పుగా ఇచ్చే డబ్బు, తిండి తిప్పలు (ఇడ్లి, దోస, చప్పాత్తి వంటివి), పయనించే దిక్కు, వాహనాల సంఖ్యలు, టెలిఫోను సంఖ్యలు, బ్యాంకు లెక్క సంఖ్యలు అని ఎక్కడైనా దేన్లోనైనా అంకెల సంబంధం ఉంటుందో అన్నింట్లోను కుశా శక్తులను ప్రసరించ వచ్చు.

ఇలా కుశా శక్తిని విస్తరించడం వల్ల మీ సామాన్య జీవిత సమస్యలను అవలీలగా అధిగమించడమే గాక మానవాళి మధ్య మంచి శక్తులను పంపి వేసిన ఆ పుణ్య కార్యానికి బహమతి కూడా భగవంతుని నుండి కుదురుతుంది.

మంచిదే జరుగుగాక !

డబ్బు మాత్రమే లేకుండా ఒకరు వాడుతున్న ఏ వస్తువులను పైన చెప్పిన పద్దతిలో ఉంచి ఆ వస్తువుల్లోను కుశా శక్తిని పంచ వచ్చు. ఇలా కుశా శక్తి పొందిన వస్తువులు మంచి పనులుకు మాత్రమే పనికి వస్తాయి అనడంవల్ల కుశా అనే శుభకరమైన శక్తులను ఈ లోకలో పంపడం దాన్నే ఒక ఆధ్యాత్మిక సాధనంగా మనం అందరూ నిర్విర్తించ పచ్చు కదా ?

ఇక్కడ మేము పేర్కొనే కుశా శక్తి యుగాలకు అతీతమైనది, కాలం అన్న పరిమితి లేనిది. ఎంతో వేల యోగులు, మహనీయలు, సిద్ధులు, మహర్షులు ఈ కుశా శక్తులను మానవాళి మంచి కోసం యుగాల నుండి ప్రయోగం చేస్తున్నారు అనేది మనకు ఇంతవరకు తెలియని రహస్యం.

కశా శక్తి యొక్క రెండవ పద్ధతును వారి వారి పరిస్థితి, అనుభవాలను బట్టి వేయ, లక్ష రితిలో పాటింటగలరు. ఇక కొన్ని పద్దతులను మాత్రం మీ సౌలభ్యం కోసం పేర్కొంటాము. వీటిని విడవకుండా పాటించడం వల్ల ఇతర పద్దతులు దానంతట మీకు అర్థమవుతాయి.

సంఖ్యా శాస్త్రమూ కుశా శక్తీ

రెండవ తత్వానికి ఉదాహరణ 1

పుట్టిన తేధీ కుశా తత్వం

ఒకరు వారి పుట్టిన తేధికి తగిన కుశా శక్తిని గణించి దాన్ని సామాన్య జీవితంలో వాడితే పలు రకాలైన ఫలాలు కలుగుతాయి.

ఉదాహరణకు, ఒకరి పుట్టిన తేధీ 1.2.1980 అనుకుంటే వారు పుట్టిన తేదికి తగిన కుశా సంఖ్యను గణించాలి. ఇక అంకె 1కు తగిన కుశా అంకె 2. అంటే, అంకె ఒకటిని నాలుగు రెట్లగా వృద్ది చేస్తే అంటే నాలుగుతో గుణిస్తే 4 అవుతుంది. ఈ నాలుకును రెండ్లో ఇమిడి పెట్టితే అంటే రెండుతో భాగిస్తే 2 అవుతుంది. ఈ విధంగా ఒక అంకెను నాలుగుతో గుణించి రెండుతో భాగిస్తే వచ్చే అంకే ఆ అంకె యోక్క కుశా అంకె అవుతుంది.

సంఖ్యా శాస్త్రం సూత్రాల ప్రకారం తేదీ 1లో పుట్టిన వారికి 1, 2, 3 అనే అంకెలు లాభకరమైన ఫలాలను వర్షిస్తుంది అనేది నియమం. దాంలో అంకె 2 కుశా శక్తితో నిండి ఉంటడం వల్ల తేధీ 2లో జరుపుతున్న అన్ని కార్యాలు మంచి ఫలాలను మాత్రమే కలిగిస్తాయి అనేది కుశా విధి.

ఇలా ఒక్కొక్క అంకెకు తగిన కుశా అంకెను గణించి మంచి ఫలాలను పొందడానికి ఈ సూత్రం దారిస్తుంది.

మరో ఉదాహరణం. ఒకరి పుట్టిన తేధీ 17.5.1990 అనుక్కోండి. వీరి పుట్టిన సంఖ్య 8 (1+7=8). విధి సంఖ్య 5 (1+7+5+1+9+9+0=32= 3+2=5). పుట్టిన సంఖ్య 8కి అధిపతి శనీశ్వరుడు ఆయువు యొక్క కారకుడు అయినపటికీ సామాన్య లౌకిక జీవతంలో, అంటే వివాహం వంటి శుభకరమైన వైభవాల్లో 8 సంఖ్యను వాడడం వాడుకలో లేనందువల్ల వీరు విధి సంఖ్యైన ఐదును మంచి కార్య సిద్ధికోసం వాడవచ్చు లేదా పుట్టిన సంఖ్య 8కి తగిన కుశా అంకెను గణిస్తే అది 7గా వస్తుంది (8 x 4 = 32/2 = 16 = 1+6 = 7). వీరు కుశా సంఖ్య 7ను అన్నీ శుభ కార్యాలకూ, మంచి ఫలాలు పొందడానికీ వాడగలరు.

ఉదాహరణ 2

ఒక్కొక్క దిక్కుకు తగిన సంఖ్య శక్తులు ఉన్నాయ. అది కూడూ సిద్ధులు ప్రసాదించాడు.

అంకె దిక్కు
1 తూర్పు
2 పడమర
3 ఉత్తరం
4 ఆగ్నేయం
5 దక్షిణం
6 నైరుతి
7 వాయవ్యం
8 పడమర
9 ఈశాన్యం
కుశంమధ్య

ఫలాని వారానికి తగిన దిక్కులో ఉండి కార్యాలను చేయడం వల్ల మనం చేస్తున్న పనుల్లో విజయమూ స్ఫష్టతా కుదురుతాయి. ఉదాహరణకు, 3.6.2015 తేధీ మూడవ తేదికి తగిన ఉత్తర దిక్కులో కూర్చుని ఒక విద్యార్థి చదివితే జటిల విషయాలను కూడా అవలీలగా అవగాహన చేసుకోగలడు.

అదే విధంగా ఆ నాటికి తగిన కుశా అంకెను గణించి, అంటే తేధీ మూడును నాలుగుతో గుణించి రెండుతో భాగించడం వల్ల కలిగే ఆరు అంకెకు (3 x 4 = 12/2 = 6) తగిన నైరుతి దిక్కులో కూర్చుని చదవడంవల్ల లేదా నైరుతి దిక్కుకు తగిన కన్యామూల గణపతిణ్ణి నమస్కరించి చదవనారంభంచడంవల్ల పరీక్షల్లో మంచి మార్కులను పొంది జీవితంలో పై స్తాయికి చేరగలడు.

ఉదాహరణ 3

పడి బియ్యవును ప్రసాదంగా కాంచిపురంలో అన్నదానం చేస్తే పదిరెట్లు ఫలాలు వస్తాయి. ఆ దానం తీర్థరాజమైన తిరుఅణ్ణామలైలో నిర్వర్తిస్తే వేయిరెట్ల ఫలాలు వస్తాయి కదా ? అలాగే, దాన ధర్మాల ఫలితాలను పలురెట్లుగా పెంచగలదే కుశా శక్తి.

మీరు ఇడ్లి దానం చెయ్యాలనుకొంటే పైన చెప్పిన పద్దతిలో కుశా శక్తితో గుణించి ఇవ్వడంవల్ల ఆ దాన మహిమ పలు రెంట్లుగా పొంగి ఫలాలు వర్షిస్తాయి. మీరు 2.5.2015 నాడు దానం చేస్తారనుకుంటే 4, 13, 22, 40 అని రెండవ తేధికి తగిన కుశా సంఖ్యలో దానం చేయడంతో వచ్చే ఫలాలు అనన్యం.

రెండవ తత్వం - కొన్ని సందేహాలు

రెండవ తత్వం అనే నాలుగుగా పెరిగి రెండ్లో లయమయే సూత్రం ఆచరణలో కొన్ని సందేహాలు రా వచ్చు.

1. ఉదాహరణకు, ఒకరి పుట్టిన తేదీ 3.8.1998 అంటే, వారి పుట్టిన సంఖ్య 3 అవుతుంది. వారి విధి సంఖ్య 2 (3+8+1+9+9+8 = 38 = 3+8 = 11=1+1 = 2). పుట్టిన సంఖ్య మూడూ విధి సంఖ్య రెండూ పరస్పరం స్నేహ భావంతో అంటున్నాయి. ఇది వారికి మంచిదే.

ఇప్పుడు వారి పుట్టిన తేదికి తగిన కుశా సంఖ్యను గణిస్తే అది (3 x 4 = 12/2) 6 అవుతుంది. సంఖ్యా శాస్త్ర ప్రకారం చూస్తే మూడు అంకెకు ఆరు అంకె శత్రు భావంతో వుంటుంది. ఈ శత్రు సంఖ్య ఎలా మంచి ఫలాలను ఇవ్వగలదని సంశయం కుదరవచ్చు.

సంఖ్యా శాస్త్రం అనేది సాధారణ గణిత సిద్దాంతం. కాని కుశం అనేది సిద్దులు అనుగ్రహించిన ప్రత్యేక సంఖ్యా సిద్ధాంతం. సాధారణ శాస్త్రానికీ ప్రత్యేక శాస్త్రానికీ మధ్య భేదం వచ్చనప్పుడు ప్రత్యేక శాస్త్రానికే ప్రధాన్యత ఇవ్వాలి అనేది సిద్ధుల ఉపదేశం. "కళ్ళు మూసి వస్తే నేల మూసి పోరు" అనే పెద్దల మాటను అనుసరించి కుశా తత్వాన్ని పూర్ణ విశ్వాసంతో సరైన పద్దతిలో నిర్వర్తిస్తే మంచి ఫలాలు మాత్రమే పోందుతారు అనేది నిశ్చయం.

2. బియ్యవు, నూనె, పిండి మొదలైన లెక్కించని పదార్థాలను వాడుతున్నప్పుడు మనం కుశా తత్వాన్ని ఎలా ప్రయోగించాలి ?

ఇటువంటి లెక్క పరిదిలోకి రాని వస్తువులను ఇదర రీతిలో అంచనా చేసుకొంటూ కుశా శక్తిని ప్రసరించవచ్చు. ఉదాహరణకు, మీ వద్ద బియ్యవు గింజలు ఉన్నాయంటే వాటిని పడి లెక్కలో లేదా కిలో లెక్కలో పెట్టి నాలగు గుట్టలుగా విభజించి పైన చెప్పిన రీతిలో రెండు గుట్టలుగా మార్చి కుశా శక్తిని పొందగలరు. అందుచేత ఆ వడ్ల గింజలన్నిట్టిలోను కుశా శక్తి పరిణమిస్తుంది.

కుశా శక్తి - మూడవ తత్వం

ఒకే రకమైన మూడు పస్తువులు వరుసగా ఉంటే మధ్య వస్తువు కుశా శక్తి పొందుతుంది. అలాగే మధ్య దిక్కు కుశా శక్తి పొందుతుంది.

వివరణ :

మూడు వేయ రూపాయిల నోట్ల వరుసగా ఉంటే మధ్య నోటు కుశా శక్తితో నిండి ఉంటుంది. వరుసగా మూడూ దీపాలు వెలిగితే మధ్య దీపం కుశా శక్తితో ప్రకాశిస్తుంది.

కుశా దీపం మధ్యది

అనేక దైవ మూర్తులు తన చేతుల్లో త్రిశూలం ధరించి ఉంటున్నారు. ఆ మధ్య శూలం మంచి మాత్రమే కలిగించడంవల్ల దైవమూర్తులతో సంహరించబడిన అసురులు, దుష్టులు వాస్తవానికి మరణించడం లేదు. వారు అసుర, దుష్ట శక్తులే తొలగి పోతాయి. అదే కుశా శక్తి మహిమ. త్రిశూలం యొక్క మధ్య శూలం క్షేమం మాత్రమే అనుగ్రహిస్తుంది.

ఇంతవరకు చెప్పిన కుశా తత్వ పద్దతులను దినసరి జీవితంలో ఎలా నిర్వర్తంచి విజయం పొందాలో దాని గురించి, ప్రతి రంగంలో కుశా శక్తిని ప్రయోగం చేసే పద్ధతులను కూడా ఇక వివరిస్తాము.

వ్యాపారులకు తగిన కుశా పద్ధతులు

మనిషిణ్ణి చుట్టువున్న కార్యాల్లో సదాసర్వదా డబ్బు లేదా వస్తువుల లేవాదేవీ కార్యాలే పెరిగి ఉన్నాయి. ఈ కార్యాలను లాభం సంపాదించే నిమిత్తం చేస్తున్నప్పడు ఆ కార్యం వ్యాపారం అవుతుంది. అందుచేత మానవ జీవితంతో అత్యవశ్యక సంగతిగా వ్యాపారం అవుతుంటడం వల్ల కుశా తత్వంతో ఎంతో సన్నిహిత్యం కలిగినదనడంలో సందేహం లేదు.

జాతకం కాలానికి అద్దమే

సాధారణంగా ఒకరు వ్యాపారాన్ని జీవనోపాయంగా ఉంచగలరా అని వారి జాతకం నుండి మనం గ్రహించగలం. ఒకరి పూర్వజన్మ కర్మల మేరకు వారి ప్రస్తుత జన్మం అమరుతుంది. అందుచేత ఒకరి జాతకంలోని నాలుగవ స్థానం స్థితి చూచి వారి వ్యాపార ఆసక్తి గురించి గణించవ్చచు.

పూర్వజన్మ ఫలితాలుగా ప్రస్తుత జన్మం కొనసాగించడంవల్ల ఈ జన్మలో ఒకరు చేయవలసిన పనులు, నిర్వర్తించవలసిన పూజలను గురించి జాతకంలో ఉన్న సూర్యాది గ్రహాలను ప్రార్థించి మనం తెలుసుకోగలం.

ఈ దైవమూర్తులను నియమం తప్పకుండా పూజించడం వల్ల వ్యాపారులు తమ వ్యాపారాన్ని బాగా పురోగమించగలరు. అన్నీ నవగ్రహ మూర్తులు సిద్దుల కుశా తత్వానికి అనుగ్రహం వర్షించడంతో కుశా తత్వం కలిసిన పూజలను అనుష్టించినప్పుడు దైవ దేవతామూర్తుల అనుగ్రహ శక్తులు పలురెట్లగా పొంగి పెరుగుతాయి.

వ్యాపార పద్దతులు

వ్యాపారం కోసం వస్తువులను కొనకోలు చేస్తున్నప్పుడు తన పుట్టన తేధికి తగిన కుశా సంఖ్యను గణించి తీసుకోవడం మంచిది. ఉదాహరణకు 3.5.1990 నాడు పుట్టిన వారు తన పుట్టిన తేధైన మూడవ తేదికి తగిన కుశా తేదీ 6, 15, 24 అనే రొజుల్లో కొనకోలుచేసుకోవడం ఉచితం.

తేధీ మాత్రమే గాక తమ వ్యాపార పనులన్నిటిలోనూ కుశా శక్తులను పంపి వేయడం గొప్పదే. ఉదాహరణకు టెలిఫోను ద్వారా వ్యాపార చర్యలను 6, 5.10, 1.05 (పుట్టిన తేధి 3కి తగిన కుశా 6 అవడంవల్ల) వంటి గంటల సమయంలో అరంభించి కొనసాగించడమూ శుభకరం.

కొనుగోలు చేయబోతున్న వస్తువులకు బయానా డబ్బు ఇవ్వాల్సి వచ్చిందే దాన్ని కూడా 6 రెట్లలో ఇవ్వడం మంచిది. అంటే 6000, 600000 రూపాయలను ఇవ్వడం, పంపడం మంచిది. వారు ఆపిల్ పళ్ళు కొనుగోలుచెయ్యాలనుకుంటే వాటిని 600, 1500 అనే లెక్కలో తీసుకోవడం మంచిది.

పైగా, మిరపకాయలు, ఉసిరి మొదలైన చిరు వస్తువులను ప్రదర్శిస్తున్నప్పుడు వాటిని నాలుగు గుట్టలుగా పైన చెప్పన మాదిరి ఉంచి, కుశా శక్తిని నింప వచ్చు.

అటువంటి వ్యాపారుల నుండి తీసుకొన్న వస్తువులు జనులకు మంచి చేసే గుణం పొంది ఉంటుంది. అందుచేత కస్టమర్లు ఆనందం పొందుతారు. వ్యాపారమూ బాగా పెరిగి సముదాయంలో శాంతి, ఆనందాలు పెరుగుతాయి.

చతురస్ర ఆవుడై కలిగించే కుశా శక్తి

మీరు శివాలయంలో శివలింగ మూర్తులను చూసి ఉంటారు. ఈ లింగ మూర్తులు చతురస్రం లేదా గుండ్ర ఆవుడై భాగంతో ఉంటారు. వారిలో చతురస్ర ఆవుడై మూర్తులు వ్యాపార అభివృద్ధకి ఎంతో అనుగ్రహం చేయగల మూర్తులు.

ఇటువంటి దైవమూర్తులు నెలకొన్న దివ్యస్థలాల్లో నిర్వర్తించే పూజలు, ప్రార్థనల వల్ల వ్యాపారం, చదువు మొదలైన రంగాల్లో మంచి పురోగతి జరుగుతుంది. చతురస్ర ఆవుడై కలిగిన లింగ మూర్తులు మన దేశములో గాక ఇతర దేశాల్లో కూడా వెలసి ఉన్నాయి.

ఇలా వ్యాపారానికి సంబంధించిన శక్తులను ప్రసరించే శివాలయాల్లో మానామదురై తగ్గర ఉన్న మేలనెట్టూరు శివస్థలం గొప్పది. ఈ స్థల మూల దేవుడైన శ్రీ స్వర్ణపురీశ్వరుణ్ణి ప్రార్థించి దిశకు నాలుగు దాపాలుగా నాలుగు దిశల్లోను మొత్తం 16 ఆవునేతి దీపాలను వెలిగించడం వల్ల వ్యాపారులు మేలు పొందుతారు. చతుర్థి, అష్టమి తిథి రోజుల్లో ఇలా విడవకుండా ప్రార్థించడంవల్ల వ్యాపారంలో కలిగే పోటీలు, ఈర్ష్యా, ఎదురుచూడని డబ్బు సమస్యలు సులభంగా తీరుతాయి.

ధ్వజ స్తంభాలు వర్షించే కోటి వరాలు

ఆలయాలు, పాఠశాలలు, వ్యాపార స్థలాలు అని ఒక్కొక్క భవనానికి తగిన వాస్తు లక్షణ నియములు ఉన్నాయి. అలాగే వ్యాపారులు ఏ దిశ కేసి కుర్చోవాలి, ఎక్కడ కజానా పెట్టాలి, గుమ్మం ఏ దిక్కు చూడాలి, ప్రకటన ముక్కలు ఏ రూపంలో, ఏ రంగులో ఉండాలి అనే వాస్తు నియమాలు కూడా ఉన్నాయి.

ఈ విషయాల గురుంచి తెలియని వారు ఏం చెయ్యాలి ? ప్రాకారంలో ఎనిమిది ధ్వజ స్తంభాలు కలిగి ఉన్న ఆలయాలు వ్యాపార స్థలానికి సంబంధించిన వాస్తు శక్తులను అనుగ్రహిస్తాయి.

ఉదాహరణకు, తిరుచి తిరుఆనైకోవెల శివాలయంలోని ప్రాకారంలో ఎనిమిది ధ్వజస్తంభాలు ఉండడం వల్ల ఈ స్తంభాలు వ్యాపార స్థలానికి తగిన వాస్తు శక్తులు, కుశా శక్తులను అనుగ్రహిస్తాయి. తమ వ్యాపారం బాగా పురోమించాలనుకొనేవారు ఈ ప్రాకారంలోని ధ్వజస్తంభాల చుట్టు ఒక స్తంభానికి ఎనిమిది ఆవు నేతి దీపాలు చొప్పున వెలిగించి ప్రార్థించడం మంచిది.

దానితో పాటు ఈ శివాలయానికి చెందిన గోశాలను నిర్వహించడాన్ని ఒక దైవీ కైంకర్యంగా స్వీకరించి, ఆవులు దూడలకు కావలసిన ఆహారాన్ని ఇవ్వడమూ, వీలయితే మంచి ఆవులను దానంగా ఈ కోవెల్లోఇవ్వడమూ వ్యాపారం బాగా పెరగడానికి సహకరిస్తాయి.

వ్యాపారం పెంచగల విణాయక చక్రం

ఒక్కొక్క దైవమూర్తికి ఒక్కొక్క మూల మంత్రం అన్నట్టు ఒక్కొక్క దేవుడుకు ఒక చక్రం ఉంటుంది. శ్రీ వల్లభ గణపతి, శ్రీ హేరంబ గణపతి, శ్రీ శక్తి గణపతి అని ఎన్నో గణపతి మూర్తులు ఉన్నా వారందరికి సంబంధించిన చక్రంగా స్వస్తిక్ అన్న వాణాయక చక్రం ఉంటుంది.

స్వస్తిక్ చక్రం

స్వస్తిక్ చక్రంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సవ్య దిశ స్వస్తిక్ చక్రం, రెండవది అపసవ్య దిశ స్వస్తిక్ చక్రం.

సవ్య దిశ స్వస్తిక్ చక్రం దైవిక్ స్వస్తిక్ చక్రం అనీ అపసవ్య దిశ స్వస్తిక్ చక్రం ఆసురిక్ స్వస్తిక్ చక్రం అనీ పిలవబడుతాయి. వాటిలో సవ్య దిశ స్వస్తిక్ చక్రమే పూజలకు తగినదనేది సిద్దుల మాట. ఈ స్వస్తిక్ చక్రాన్ని కచ్చితంగా చిత్రించడం వల్ల మంచి కుశా శక్తిని పొంద గలరు. అది ఎలాగంటే, మొదట ఎడమ వైపు నుండి కుడి వైపు భాగాన్ని చిత్రించి తరువాత కింద నుండి పైకి రెండవ భగాన్ని చిత్రించాలి. (వీడియో చూడండి) పసుపు పోడి, కుంకుమతో ఈ చక్రాన్ని అలంకరించడమూ మంచిదే.

విణాయక చక్ర పూజ పద్దతి

ఇటువంటి దైవిక్ స్వస్తిక్ చక్రం అద్భుతమైన స్వర్ణప్రద శక్తులను వర్షిస్తుంది. చక్రానికి మధ్యలో ఒక ఆవు నేతి దీపం ఉంచి, చక్రానికి నాలుకు వైపులో నాలుగు ఆవు నేతి దీపాలను అవి మధ్య దీపాన్ని చూస్తూండగా అమర్చడం మంచిది. మీకు తెలిసిన విణాయక స్తోత్రం, స్తవం వంటి వాటితే పూజించ పచ్చు. ఈ పూజ ఫలితంగా అందరి కంటే వ్యాపారంలో మంచి పురోగతి కలుగుతుంది.

ఇటువంటి పూజలతో వ్యాపారంలో కలిగే మార్పులు లోకులకు కూడా మేలు చేస్తాయి అనేది ఇక పేర్కోదగ్గది. విణాయక చక్ర పూజ పూర్ణం అవుతుండగా బాదాం కలిసిన పాయసం దానం డబ్బుల ఆదాయాన్ని స్థిరం చేస్తుంది. అనుభవం లేని పని మనుషులు, సిబ్బందుల ద్పారా కలిగే నష్టాలు తగ్గిపోతాయి.

ప్రస్తుతం పలు వ్యాపారులు ఎదురుకుంటున్న ముఖ్య సమస్యలు ఏమిటంటే తగిన సిబ్బందులు, ఉద్యోగులు చేకూరక పోవడమే. ఒక వేళ తగిన పనిమనుషులు లభించినా వారు నిరంతరంగా పనిలో ఉండక ఇతర పనులను కోరి మారి పోతారు.

ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నావారు తిరుచి తగ్గరి తిరువెళ్ళరై, తిరిచి లాల్గుడి తగ్గరి చిరుమయంగుడి వంటి స్థలాల్లో మూలదేవుడుకు అభిషేకాలతో ఆరాదించి 108 తామర పుష్పాల మాలలు అర్పించడం వల్ల తగిన అర్హతతో నిరంతరమైన పనిమనుషులు లభిస్తారు. తిరువెళ్ళరై శ్రీ పుండరీకాక్ష పెరుమాళ ఆలయలోనూ, శ్రీ వడజంబునాథుడు శివాలయంలోనూ పైన చేప్పిన పూజ పద్దతులను నిర్వర్తించ వచ్చు.

త్వర త్వరగా పురోగతి

కొంద మంది వారు వ్యాపారం మొదలుపెట్టిన కోన్ని మాసాల్లోనే పురోగతి చెందుతారు. కాని అనేకులు ఎంతగా ప్రయత్నించినా "ఏదో వ్యాపారం చేస్తున్నాం" అనే మంద గతిలోనే వ్యర్థంగా వ్యాపారం చేస్తుంటారు. ఈ పరిస్థితికి పూర్వజన్మ కారణాలు అనేకాలు ఉన్నాయి గాని, తమ పూర్వ జన్మ ప్రభావాన్ని తగ్గంచకోవడానికి ప్రయత్నించక పోవడమూ పోరపాటే. ఇలా విధి ప్రకారం వచ్చిన ఆర్తిక లోపం, కష్ట జీవనం, వ్యాపార మంద స్థితి మొదలైన సమస్యలను వంటనే పరిష్కరించలేక పోయినా కొంచమైనా పూర్వ జన్మ కర్మ ఫలితాల ప్రభావం నుండి విముక్తి పొంది తమ వ్యాపారాన్ని చక్కగా జరపడానికి దారి చూపగలదే సిద్ధులు అనుగ్రపించిన అష్ట నమస్కార పద్దతి.

వినమ్రంగా ఉంటే విప్రుడు

అష్టాంగ నమస్కారం లేదా సాష్టాంగ నమస్కారం అనేది భగవంతుణ్ణి, తలిదండ్రులను, పెద్దలను నమంస్కరించేటప్పుడు పాదాలు, మోకాళ్ళు, అరచేయిలు, ఛాతి, నుదురు అని శరిరాన్ని ఎనిమిది భాగాలు నేల మీద ఉంచి సమస్కారం చేయడం అవుతంది. భక్తుని భక్తిణ్ణి చూపేదే నమస్కారం.

పంచాంగ నమస్కారం అనేది మహిళాలు భగవంతుణ్ణి, భర్తను, పెద్దలను, తల్లి తండ్రులను నమస్కరించేటప్పుడు పాదాలు, మోకాళ్ళు, నుదురును నేలపై పడే విధంగా ఉంచి ప్రణామం చేయడం. చేతులను జోడించి గాని లేదా వక్షస్థలం మీద గాని పెట్టుకో వచ్చు.

అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం వలె సిద్ధులు అనుగ్రహించిన ఒక గొప్ప నమస్కార పద్దతి ఉన్నది.

అనుసరణకు ఎంతో అవలీలగా ఉన్న ఈ నమస్కారం యొక్క ఫలాలను వివరించడానికి యుగాల కాలం కూడ చాలదు. ఈ నమస్కారాన్ని కనీసం మూడు సార్లు దేవుడు ఎవరికీ చేసినా మన శరిరంలోని 72000 నాడి నరాలూ శక్తీ బలమూ పొందుతాయి. సత్యపీఠ నమస్కారం అని పేర్కోబడిన ఈ నమస్కారం సరియైన పద్దతిలో చేసి మీ కార్యాయాలన్నిటిలోనూ క్షేమం పొందండి.

కాని మనం ఇక్కడ చెప్పేది ఎనిమిది దిక్కులను చూస్తూ, ఎనిమిది దిక్కుల్లో ఉండి భగవంతుణ్ణి ప్రార్థించే అష్టదిక్కు నమస్కారం లేదా అష్టనమస్కారం. ఈ ఎనిమిది నమస్కారాలను అష్టాంగ నమస్కార పద్దతిలో గాని పంచాంగ నమస్కార పద్దతిలో గాని విశేషంగా సత్యపీఠ నమస్కార పద్దతిలో గాని నిర్వర్తించ వచ్చు.

అష్ట నమస్కార పద్దతి

అష్ట నమస్కారం దేవతా మూర్తులకు అందరికి తగిన నమస్కార పద్దతి అవుతుంది. విశేషంగా జీవ సమాధుల్లోనూ, అతిష్టనాల్లోనూ, బృందావనాల్లోనూ చేయబడిన ఈ అష్టనమస్కారాలు ప్రార్థన ఫలితాలను పలు రెట్లు వృద్ది చేస్తాయి. దాంలో మొడటి నమస్కారం సింహద్వారంలో మూల విరాట్టు కేసి చేయాలి. తరువాతి నమస్కారాన్ని ప్రదక్షిణంగా ఒక్కొక్క ప్రధాన దిక్కులో నిలబడి చెయ్యాలి. ఇలా ప్రాధాన దిక్కు నమస్కాం నెరవేర్చిన పిదవ ఈ ప్రధాన దిక్కుకు మధ్య దిక్కుల్లో ప్రదక్షిణంగా తురువాతి నాలుగు నమస్కారాలను చేయాలి.

ఉదాహరణకు, మూల విరాట్టు పడమటాభిముఖంగా ఉంటే మొదట పూర్వం, దక్షిణం, పడమర, ఉత్తరం దిశలు కేసి నమస్కరించి తరువాత ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం దిశలు కేసి నమస్కరించాలి. ఈ ఎనిమిది నమస్కారాలే అష్టనమస్కారాలు అవుతాయి. ఇది గొప్ప శక్తి గల నమస్కార పద్దతి అవుతుంది. ఈ పూజ తరువాత జీడి పప్పు కలిసిన పులిహోర దానం మంచిది.

తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం

వ్యాపారులకు కాకండా తయారీదారులకు కూడా ముడి పదార్థాల పొదుపు కలిగించేది కుశా శక్తే. వారి వారి విశ్వాసం మేరకు కుశా శక్తి ద్వారా ఎన్నో ఫలాలను పొందగలరు. ఉదాహరణకు, మీరు తీపి మిట్టాయిల వ్యాపారం చేస్తారనుకొందాం. మీకు ఒక నాడు పది కిలో రవ్వ పది కిలో చక్కెర కావలసిందనుకొందాం. ఇప్పుడు ఈ ప్రక్రియలో కుశా శక్తి పద్దతులను నిర్వర్తించే కనీసం పది శాతం రవ్వ, చక్కెర పొదుపు వస్తుంది.

అదెలా ?

మీరు చేయ వలసింది ఇదే. సాధారణంగా ప్రతిదినం వాడుతున్న పది కిలో రవ్వ, పది కిలో చక్కెరకు బదులుగా ఇప్పుడు తొమ్మిది కిలో రవ్వ, తొమ్మిది కిలో చక్కెర మాత్రం తీసుకొని వాటిని పది భగాలుగా అమర్చుకోవాలి. ఆ పది భాగాలను ఒకటి, రెండు, మూడు, ... తోమ్మిది, కుశం అని లెక్కించాలి. అందుచేడ ఆ పది భగాల్లోనూ అంటే తొమ్మిది కిలో పదార్థాల్లోనూ పది కిలోకు కావలసిన కుశా శక్తులు నిండి పోతాయి. కాని మీకు పది కిలో పదార్థాలు వాడినట్టు మిట్టాయిలు లభిస్తాయి. ఎంత అద్భుతం. ఇది నిజమా ? నిజమే. ఈ నాటికి సాధ్యమా ? ఎల్లప్పుడూ సాధ్యమే.

అంతే గాక ఆ మిట్టాయిలు కూడా ఎంతో రుచిగా ఉండి మీకు అనేక కస్టమర్లను ఆకర్షిస్తాయి.

కుశా పద్దతిని చదవడం కంటే దాన్ని ఆచరణలో పెట్టితేనే దాని మహిమ తెలుస్తుంది. పైగా, ముడి పదార్థాలను నాలుగుగా విభజించి రెండుగా కలిసి కూడా కుశా శక్తిని పొంద వచ్చు.

ఈ మిట్టాయిలను వాడుతున్న వారికి మంచి ఆలోచన, చక్కని ఆరోగ్యం పెరగడమూ నిశ్చయం. కుశా పద్దతులు ఎంతగా ఆచరణకు వస్తాయో అంతగా వాటి అద్బుద ఫలాలు కుదురుతాయి.

ఓం గురువు శరణం

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam