కుళలుఱవుత్యాగి 
               
 
 
బిడ్డగా ఉండి చూచు భగవంతుడు నీ కంటికి కనిపిస్తాడు!

ఓం శ్రీవల్లభ గణపతి రక్ష
ఓం శ్రీఅంకాళ పరమేశ్వరి రక్ష
ఓం శ్రీ గురవే శరణం

తలిదండ్రులు పిల్లల భవిష్యత్తును నిర్ణయించడం ఎలా?

రమ్యమైన కావేరి నది తీరాన నెలకొన్న స్వామిమలై శివాలయంలో ముని శ్రేష్ఠుడైన అగస్త్య భగవానుడు తమ శిష్యులతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి మాట్లాడుతున్నారు. కరుణాసాగరమైన అగస్త్య మహర్షి పరోపకారార్థం అందజేస్తున్న అనుగ్రహాలు ఏమిటో తెలుసుకొందామా ?

బోగరు (ఒక శిష్యుడు) : మహాదేవా ! బాలమురుగుని దర్శనం మనస్సుకు ఎంత సుతిమెత్తగా ఉంటుంది.

అగస్త్య (గురుదేవుడు) : ఔను, ప్రియ శిష్యుడా ! తండ్రికే ఉపదేశం చేసిన వాడు కదా ? వాడు దర్శనం గొప్పదే.

బోగరు: జ్ఞాన ప్రబో ! పిల్లలు అంటేనే కుతూహలమే. పిల్లల చేతిలోనే వారి భవిష్యత్తు కూడా ఉంటుంది ?

అగస్త్య : దాంలో సందేహం ఎదీ లేదు. కాని పిల్లల భవిష్యత్తును గొప్పదిగా తయారు చేయవలసిన బాధ్యత తల్లి తండ్రులదే.

బోగరు : తల్లి తండ్రులు పిల్లల భవిష్యత్తును విశేషంగా అమర్చడం ఎలా, గురుదేవుడా ?

అగస్త్య : దాని కోసం తల్లి తండ్రులు పెంపొందవలసిన కోన్ని ప్రాథమిక అర్హతలు ఉంటున్నాయి. మొదట తల్లి తండ్రులు ఇద్దరూ భగవంతుని పట్ల విశ్వాసం కలిగినవారై ఉండటం అవసరం. వారు భక్తులుగా ఉండాలని అక్కర లేదు. వారికి భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంటేనే చాలు.

బోగరు : భక్తి వేరు విశ్వాసం వేరు అలాగేనా, గురుదేవుడా ?

అగస్త్య : ఔను. నాయనార్ల వద్దనూ ఆళవారుల వద్దనూ మనం చూస్తున్నది భక్తి. " శివుడా, నిన్ను నేను మరచి పోయినా నా నాలుక నీ నామాన్ని ఉచ్చరించడం మరచి పోదు," అంటూ విలపించిన నాయనారుల భక్తిణ్ణి సాధారణ మానవుడి వద్ద చూడటం అరుదు. భక్తితో కూడిన నమ్మకం ఉంటే గొప్పది.

తల్లి తండ్రులు తమ తల్లి తండ్రుల పట్ల ప్రేమతో ప్రవర్తించి వారి హృదయ పూర్వమైన ఆశీస్సులను పొంది ఉండటం మొదటి అర్హత అవుతుంది.

తను మాత్రం సుఖముగా జీవించుకొంటు తల్లి తండ్రుల పట్ల అశ్రద్ద వహించి అనాథ ఆశ్రమానికి పంపివేసే తగని కార్యాన్ని, ఇంట్లో పనివాడుగా గాని దాసీదానిగా గాని నడిపే చర్యలను చెయ్యకుండా ఉండాలి.

బోగరు : తల్లి తండ్రులను పూజించే సాధారణ పద్దతి ఏమిటో, గురుదేవుడా ?

అగస్త్య : ప్రతి దినం తల్లి తండ్రుల పాదాలను ఒక సారైనా తాకి ప్రణామం చేసి బయటకి వెళ్ళాలి. బయట పని ముగించాక సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళి తల్లి తండ్రుల పాదాలను తాకి నమస్కరించాలి.

పులిపాణి (ఒక శిష్యుడు) : " తల్లి తండ్రుల పట్ల ప్రేమ, మర్యాద మనసులో ఉంటే చాలదా ? ఇటువంటి బాహ్య వేషాలు ఎందుకు ?" అని కొందరు అడుగుతారు, గురుదేవుడా.

అగస్త్య : వాస్తవమే. కాని సొంత తల్లి తండ్రులకు ప్రణామం తెలుపే కార్యాన్నే వేషం కింద పరిగణిస్తున్న యువకులైన దంపతులకు ఎన్నడూ మంచి బోధించ లేము. వారికి భగవత్ విశ్వాసం రాదు.

బోగరు : గురుదేవుడా ! ఎందుకు తల్లి తండ్రులను పూజించి బయటకి వెళ్ళాలి, పూజించి లోపలకి రావాలి ?

అగస్త్య : మేము చంటిపిల్లలుగా ఉన్నప్పడు ఎన్నో సార్లు వారిని తన్ని ఉంటాము. అప్పుడా తల్లి తండ్రులు మమ్ములను మందలించుకొన్నారా ? తన్నిన కాళ్ళకు అందెలు వేసి సంతోషం పొంది ఉంటారు కదా ? ఆ పాదాలకు ముద్దులు వర్షించి మైమరిచి ఉంటారు కదా ?

మన చిన్నతనంలో చేసిన పొరపాటకు ప్రాయశ్ఛిత్తంగానే వారికి ప్రణామం చేసి బయటకు వెళ్ళాలి, ప్రణామం చేసి లోపలకి రావాలి అంటారు. కేవలం నటన కోసం కాదు.

తల్లి తండ్రుల విలువ తెలియకుండా నటన అని భావించే భర్త భార్యలకు దైవ నమ్మకం ఎలా కుదురుతుంది ? అందుచేత కళ్ళకు కనిపిస్తున్న తల్లి తండ్రులను మొదటి దైవాలుగా భావించనివారు భవిష్యత్తులో తమ బిడ్డలను బుద్దివంతులుగా ఎలా సృష్టించగలరు ? సక్రమంగా వారిని ఎలా పెంచగలరు ? ఎలా మేధస్సు ప్రకాశించే కుమారుణ్ణి చూడవచ్చు ? తలిదండ్రులు తమ పిల్లలను దిట్టలుగా చూడాలి, వారిని దిట్టలుగా పెంచాలంటే మొదట తమ తల్లి తండ్రులను ఎలా తగిన రీతిలో గౌరవించాలో తెలుసుకోవడం అవసరం.

బోగరు : తల్లి తండ్రుల పూజ తరువాత తలిదండ్రులు చేయవలసిన సేవలు ఏమటో, గురుదేవుడా ?

అగస్త్య : తలిదండ్రులను నియమబద్దంగా ఆరాదించి వారి హృదయ పూర్వమైన పరిపూర్ణ ఆశీస్సులను పొందిన దంపతులు ఆ తరువాత చేయవలసిన పని భగవత్ సేవలు.

తాను ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించనివారు అయతే ఇదివరకే అనేకులు కలిసి దైవ విశ్వాసంతో పూర్ణంగా నిర్మించిన ఆలయాన్ని నిర్వహించాలనే సంస్కారం ప్రతి దంపతులకు ఉండి ఉండాలి, రావాలి.

కోవెలను నిర్వహంచాలంటే నిత్య పథకాలు గాని, బ్రహమోత్సవాలు గాని నిర్వహించాలి అని అర్థం కాదు. ప్రతి దినం ఆ కోవెల పరిశుభ్రంగా ఉండడానికి తమకు వీలయినంత సేవలు చేస్తేనే చాలు.

పులిపాణి : గురుదేవుడా ! కోవెలను నిర్వహించడానికి మాత్రం జీతం తీసుకుంటున్న పనిమనిషులు ఉంటున్నారు కదా అని కొందరి భవన.

అగస్త్య : వాస్తవం. కాని జీతం తీసే మనుషులు ఒక కోవెలకు సరిపోని స్థితి ఉండవచ్చు. లేదా వారు జబ్బు చేసింది గాని ఇతర కారణాలతో గాని శుభ్రపరచే పనులు చేయలేక పోవడము ఉండును. అందుచేత జీతానికి ఉంటే మనుషుల సాకుతో ఆలయ సేవలను తిరస్కరించడం పొరపాటే.

ప్రతి దినం ఒక చిరు పనియైనా ఆలయంలో నిర్వర్తించడం దంపతులు అలవాటు చేసుకోవడం మంచిది. ఇలా చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన మనస్సులో పరిశుభ్రమైన ఆలోచనాలు పెరుగుతాయి. భగవత్ నమ్మకంతో చేయబడిన సేవలచేత కలిగే మంచి చింతనాలతో ధర్మ భావనాలు లోలోన కుదురుతాయి.

బోగరు : గురుదేవుడా ! ధర్మ కార్యాలు చేయడంవల్ల ఒక మనుషి మరొకరికి సోమరితనాన్ని పండినట్టుగా అవుతుంది అనేది కొందరి వాదం.

అగస్త్య (చిరు నవ్వుతో) : అది పొరపాటు. సోమరితనం కలిగి ఉన్న వానికి భగవంతుడే అన్నం ఇవ్వడం లేదు. అలాగైతే నువ్వు ఒక సోమరికి అన్నం ఇవ్వగలవా ?

అందుచేత మీరు ఒకరికి అన్నం ఇస్తారంటే దాన్ని స్వీకరించేవాడు ఎవరికైనా ఏదో ఒక జన్మలోనైనా అన్నం ఇచ్చి ఉండి ఉండాలి. కాకపోతే భగవంతుడు మీ ద్వారా అన్నం ఇవ్వడు. ఈ విషయాన్ని ప్రతి ఒకరు అవగాహనం చేసుకోవడం అవసరం. అన్నం పంచాలి అనే ఆలోచన మీ మనస్సులో ఉదయిస్తే మీ మనస్సే ఎవరికి అన్నం పెట్టాలి అని న్యాయ నిర్ణయం చేయగలదు. అందుచేత ధర్మ చింతన పెరిగితే త్యాగ ఆలోచనాలు లోలోన కుదురుతాయి.

బోగరు : అనురాగ శిఖరమా ! త్యాగ ఆలోచనాలు మంచి పనుల కింద జరగడానికి దంపతులు ఏం చెయ్యాలి ?

అగస్త్య : ఉన్నత త్యాగ ఆలోచనాలను నెరవేర్చాలంటే సత్సంగం తప్పనిసరి. దంపతులు తమను ఒక సత్సంగంతో కలుపుకోవాలి. సత్సంగంలోనే త్యాగ ఆలోచనాలకూ, త్యాగ కార్యాలకూ అవకాశాలు లభిస్తాయి. సత్సంగంలోని మార్గనిర్దేశకుడు మీ మన పరిహద్దుకు వచ్చే విధంగా మీమ్ములను త్యాగ కార్యాల కోసం సిద్దం చేస్తారు.

ఈ త్యాగ కార్యం సరైన పద్దతిలో నిర్వర్తించబడి కార్యాలను అమలుపరచినప్పుడే శరీరంలోని రక్తం దైవ అనుగ్రహం కలిగిన పెద్దల ఆశీస్సులను గ్రహించే శక్తి పోందుతుంది. అలా పెద్దల ఆశీస్సులను గ్రహించిన రక్తం కచ్చితంగా భగవంతుని అనుగ్రహంతోనూ శుభ్రం చేయబడి గొప్ప శక్తి గల వీర్యంగా శరీరంలో మార్పు చెందుతుంది. ఇప్పుడు భగవంతుడి అపార కరుణతో పెద్దల ఆశీస్సులూ, దాన ధర్మాలతో కలిగిన పుణ్య కార్యాల ఆశీస్సులూ, త్యాగ కార్యాలతో చేకూర్చే ఆశీస్సులూ, సత్సంగ మార్గదర్శకుడి నేత్ర ఆశీస్సులూ, సత్సంగంలో సేవ నిర్వర్తించి వచ్చిన ఆశీస్సలూ ఒకటిగా కలిసి ఉన్నత స్థితియైన ప్రాణాల స్థితికి ఆదారపడి ఉత్తమమైన శిశు జన్మించడానికి భగవత్ అనుగ్రహం కుదురుతుంది.

బోగరు : సద్గరు మహాదేవుడా ! ఇలా జన్మించిన శిశువును తల్లి తండ్రులు ఎలా పోషించాలి ?

అగస్త్య : ప్రియ బోగా ! 15 వయసు వరకు తలిదండ్రులకు అంతని బాధ్యత ఉంటుంది. శిశువులను ఏమాత్రం ఉక్కు తొట్టిలో పరుండబెట్ట కూడదు. తొట్టి వేలాడ దీయడానికి ఎటువంటి ఉక్కు భాగాలను వాడ రాదు. తొట్టి యొక్క అన్ని భాగాలు కలపతోనే ఉండటం మంచిది. ఉక్కు వాడే తప్పనిసరి స్థితిలో ఇనుము భాగాలేవి తొట్టికి తాకకుండా అమర్చుకోవాలి.

ఉదాహరణకు, ఉక్కు వలయాల్లో తొట్టి వేలాడ వలసిందంటే రెండు ఉక్కు వలయాలకు మధ్య ఒక కలప కర్రను పోసి ఆ కర్రకే తొట్టిని వేలాడ దీయడం వల్ల తొట్టి యొక్క ఏ భగమును ఉక్కు తాకదు. తల్లి తండ్రులు ఈ విషయం పై ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

బోగరు : కలప దూలముకు తొట్టి వేలాడ దియ్యోలనడం ఎందుకు, గురుదేవుడా ?

అగస్త్య : శరీరానికీ ఉక్కుకూ మధ్య సంబంధం రాకూడదనే కారణంతో కలప దూలంకు తొట్టి వేలాడ దీస్తాము. ఇనుములో పచ్చని చిగురు విద్యుత్ శక్తి ఉంది. తిన్నగా ఉక్కు వలయంలో తొట్టిని కట్టితే తొట్టి ద్వారా ఆ చిగురు విద్యుత్ శక్తి శిశు శరీరం లోపలకి ప్రసరిస్తుంది. ఆ విద్యుత్ శక్తి శిశు భరించని రీతిలో ఉండటం వల్ల శిశు మనోస్థైర్యం కోల్పోతుంది. అందుచేత కలపతో సంబంధించిన తొట్టిలో గాని కలప దులములో వేలాడే తొట్టిలో గాని పిల్లల్ని పరుండబెట్టడం వల్ల పిల్లల మనోబలం పెరుగుతుంది. పిల్లల మనో స్థైర్యాన్ని పండించ వలసిన గొప్ప బాధ్యతను తలిదండ్రులు ఈ పద్దతిలో నిర్వర్తించాలి.

ప్రస్తుతం ఉక్కు స్ప్రింగులో (steel spring) తొట్టిని కట్టుతారు. ఇది సరి కాదు.

వీలయినంత మట్టుకు కలప దూలములో తొట్టిని రోహిణి నక్షత్రం నాడు కట్టాలి.

పులిపాణి : రోహిణి నక్షత్రం నాడు తొట్టి కట్టాలన్న అవశ్యకత ఎందుకు, గురుదేవుడా ?

అగస్త్య : అంజనా దేవి శువుని గురించి కఠోర తపస్సు నిర్వర్తించింది. శివుని అపార కరుణతో గర్భం ధరించి మహా సుందర పురుషుడైన ఆంజనేయ స్వామి జన్మించాడు. హనుమంతుణ్ణి మర్రి చెట్టు కోమ్ములో శివునికి అర్పించిన వస్త్రంతో తొట్టి కట్టింది. అప్పుడు బ్రహ్మ దేవుడు, "రోహిణి నక్షత్రం నాడు బిడ్డను తొట్టిలో పరుండబెట్టితే పిల్లవాడి మనోస్థైర్యం తగ్గి పోదు ! " అని అనుగ్రహించాడు. అందుచేత రోహిణి నక్షత్రం నాడు తొట్టి కట్టి దాంలో బిడ్డను పెట్టడం అవసరం. తలిదండ్రులు ఈ విషయం బాగా గమనించాలి.

బోగరు : గురుదేవుడా ! బయట ప్రదేశాలకు వెళుతూంటే అక్కడ తొట్టి కట్ట వలసి వచ్చిందే అప్పుడు ఏం చెయ్యాలి ?

అగస్త్య : రోహిణి నక్షత్రం నాడు కట్టిన తొట్టి వస్త్రాల్లో కొన్ని తల్లి తండ్రులు నిలువ ఉంచుటుకొని (spare) వాటిని రైలు బండిలో పయనం చేస్తున్నప్పుడు గాని ఇతర చోటుల్లో గాని ఆ వస్త్రాన్ని వాడ వచ్చు. ఉడుకుతున్నప్పడు గాని చిరిగి పోయినప్పుడు గాని మార్చ వలసి వచ్చినప్పుడు ఇలా నిలువ పెట్టిన వస్త్రాన్నే వాడాలి.

ఈ విధంగా రోహిణి నక్షత్రం నాడు కట్టిన తొట్టిలో పిల్లల్ని పరుండబెట్టడంవల్ల బాదురుతి అనే దేవత అనుగ్రహంతో పిల్లల మేదడు క్రమంగా ఎదిగి మనోస్థైర్యం పెరుగుతుంది. దీన్ని ప్రతి తలిదండ్రులు మనస్సులో జాగ్రత్తగా అవగాహనం చేసుకోవాలి. ఎక్కడకు ప్రయాణం చేసినా రోహిణి నక్షత్రం నాడు కట్టిన తొట్టి వస్త్రాన్ని వెంటబెట్టుకొని దాంలోనే పిల్లను పరుండబెట్టాలి. ఇలా చేయడం వల్ల బిడ్డల మనోస్థైర్యం పెరగడానికి తలిదండ్రులు ఒక గోప్ప పనిముట్టుగా పనికొస్తారు.

తొట్టికి కేవలం పత్తి వస్త్రం మాత్రమే వాడాలి. ఆ వస్త్రాన్ని అమ్మవారికి లేదా శివునికి లేదా తన ఇష్ట దేవునికి అర్పించి తరువాత వాడడం వల్ల విశేషమైన ఫలాలు కుదురుతాయి. ధోవతీలూ చీరలూ వంటి అన్నిటినీ తొట్టికోసం వాడగలరు. కాని పట్టు వస్త్రం పనికి రాదు.

వస్త్ర తొట్టికి బదులు తొట్టి ఉయ్యాలు వాడితే కలప ఉయ్యల్లోనే (wooden cradles) పిల్లలను పరుండబెట్టాలి. ఉక్కు ఊయలు వాడ రాదు. పత్తి లేదా బారుగుదూది పరుపు వాడాలి. Rubber, foam sheets వాడ రాదు. కలప ఊయల్లో పిల్లల్ని పరుండబెట్టాలంటే అది ఆరుద్ర నక్షత్రం నాడు మాత్రమే చేయాలి.

బోగరు : ఆరుద్ర నక్షత్రం నాడు బిడ్డలను కలప ఊయల్లో పరుండబెట్టడంలోని ప్రాముఖ్యత ఏమిటో, గురుదేవుడా ?

అగస్త్య : వసుదేవుడు తనకు జన్మించిన ఎనిమిదవ శిశువైన కృష్ణ పరమాత్మను దేవకి నుండి కొనిపోయి గోకులంలోని యసోదా తగ్గరకు వదిలేసాడు. నందగోపుడు కృష్ణను చూసిన పరమానందంలో పక్కన ఉన్న కలప ఊయల్లో ఆరుద్ర నక్షత్రం నాడు పరమాత్మను పరుండబెట్టారు. ఇలా చేయడంవల్ల జయదుర్గ యొక్క అనుగ్రహం కలిగి పరిస్థితి అవకాశాలను ఎలా సద్విని యోగం చేసుకోవాలనే శక్తి ఆ బిడ్డకు వస్తుంది.

అందుచేత ఆరుద్ర నక్షత్రం నాడు బిడ్డను కలప ఊయల్లో పడుకోబెట్టితే పరిస్థితి అవకాశలను ఎలా సద్విని యోగం చేసుకొవాలో ఆ బిడ్డకు చిన్నతనం నుండే జయదుర్గా దేవి పెంచుతోంది.

ఇతిహాసాల పురాణాల సంభవాలను ఈ నాటి లోకులకు వివరించడమే భగవంతుని అవతార పురుషులు పొందిన అనుగ్రహాలనూ లాభాలనూ మనమూ పొందాలి అనే లక్ష్యం మీదనే. అందుచేత జనులందరూ ఈ దృష్టాంతాలను చక్కని రీతిలో ఉపయోగం చేసుకోవాలి.

వీలయినంతమట్టుకు తలిదండ్రులు గాని అనేక పిల్లలను జన్మిచ్చి పెంచిన కుటుంబ పెద్ద సభ్యులు గాని పిల్లలను ఊయల్లో పడుకోబెట్టాలి, ఊయలనుండి పిల్లలను ఎత్తుకోవాలి.

బోగరు : తలిదండ్రులు పెద్దలు మాత్రమే పిల్లలను ఊయల్లో పడుకోబెట్టాలి అనడం ఎందుకు, గురుదేవుడా ?

అగస్త్య : పిల్లలను ఊయల్లో పడుకోబెట్టేటప్పుడు పలు భాగాల శరీర విభజన అనే పద్దతిలో అది తన వూర్వ జన్మ కర్మలను నెరవేర్చే నిమిత్తం astral travel చేయవచ్చును. ఆ పయణంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆపద తేకుండా భద్రంగా తిరిగి రాపడానికి తలిదండ్రుల ఆశీస్సులు అవసరం.

భగవత్ చింతనతో తలిదండ్రులు, పెద్దలు పిల్లలను ఊయల్లో పడుకోబెట్టడం అలవాటు చేసుకోవాలి. అలా లేక ఇతరుల ద్వారా పిల్లలను ఊయల్లో వేస్తే సరైన ఆశీస్సులను పిల్లలకు లేక పోవడం వల్ల astral travel తరువాత తిరిగి శరీరంలోపలికి రావడం కఠినం అవుతుంది. తప్పనిసరిగా శరిరంలోపలకి ప్రవేశిస్తే శరీరం "భయం" అనే స్థితి ఎదురుకోవలసి వస్తుంది.

ఇదే భవిష్యత్తులో కారణం లేకుండానే పలు విషయాల గురించి పిల్లలకు భయం రావడానికి ఆధారపడుతుంది. అందుచేత పరాక్రమం కలిగిన ఒక పోరు వీరిని ధైర్యం పిల్లలకు కావాలంటే చిన్నతనం నుండే ఆ ధైర్యాన్ని పెంపోందించాలి. దానికి తలిదండ్రులు తమ ఇంటి ముఖ్య పెద్దలను ఆహ్వానించి వారి ద్వారా వుష్యమి నక్షత్రం నాడు కొత్త తొట్టిని వేసి దాంలో పిల్లలను పెట్టాలి.

బోగరు : స్వామి ! పుష్యమి నక్షత్రం నాడు పిల్లలను ఊయల్లో పడుకోబెట్టే అలవాటు ఎలా వచ్చింది ?

అగస్త్య : నారాయణ భగవానుడి అనుగ్రహంతో గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని నారద ముని ద్వారా ఉపదేసంగా పొందినవాడే ప్రహ్లాద మూర్తి. ప్రహ్లాద మూర్తిని తల్లి వాడిని పుష్యమి నక్షత్రం నాడు తొట్టిలో పడుకోబెట్టి పెంచింది. ఎన్నో ఇబ్బందులూ దు:ఖాలూ ఎదురైయినప్పుడు వాటిని ధైర్యంగా అనుభవంచడానికి ఇదే ముఖ్య కారణమై పోయింది.

అందుచేత తలిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలను పుష్యమి నక్షత్రం నాడు తొట్టి లేదా ఊయల్లో పడుకోబెట్టి పెంచడం మంచిది. పిల్లలకు 15 ఏళ్ళ వచ్చే వరకు ఈ నక్షత్రంలోనే పరుపు అమర్చ వచ్చును.

బోగరు : గురుదేవుడా ! పిల్లలు ఎదిగి పెద్దవారైనప్పుడు కూడా పుష్యమి నక్షత్రం నాడు మెత్త అమర్చు కోవడం వల్ల విశేషమైన ఫలాలు వస్తాయి కదా ?

అగస్త్య : కచ్చితంగా ! పిల్లలు కళాశాల్లో చదివే స్థితికి వచ్చినప్పుడు గొప్పవారు వారికి మంచం తీసుకొంటారంటే కలప మంచం పుష్యమి నక్షత్రం నాడు కొనుగోలుచేసి మెత్త అమర్చాలి. అలాగే పరుపు (bed) దుప్పటి (bed sheets) దిండ్లు కూడా తీసుకోవడం వల్ల విశేషమైన ఫలాలు వస్తాయి.

బోగరు : గురుదేవుడా ! చిన్నతనంలోనే astral travel జరుగుతుందా ?

అగస్త్య : ఔను. కలియుగంలో పిల్లలు మూడు వయసు వరకు పూర్వ జన్మ కర్మలను నెరవేర్చే నిమిత్తం astral travel చేస్తారు. ఆధ్యాత్మిక జివితం కడపేవారైన తలిదండ్రుల పిల్లలు ఐదు వయసు వరకు astral travel చేస్తాయి. "పండిన పళ్ళు" అని సిద్దులతో ప్రశంసించబడే కాంచి పరమాచార్యా తన 12వ వయసులోను astral travel చేసి ఉన్నత భగవత్ కైంకర్యాలు చేశాడు.

పిల్లలకు అన్న ప్రసానం చేసే అలవాటు

పిల్లల మొదటి ఆహారం తల్లి పాలు. పిల్లల శరీరంలో చురుకుతనం, బలం రావాలంటే తల్లి అశ్విని నక్షత్రం నాడు10000 సార్లకు తగ్గకుండా శివ నామాన్ని జపించి శక్తి ప్రదంగా పాలు పట్టడం ఉత్తమం. ఇలా చెయ్యడం వల్ల పిల్లలకు కావలసిన చురుకుతనమూ బలమూ దొరుకుతాయి.

తల్లి ఇక గమనించవలసిన విషయం ఏమంటే వాళ్ళు అశ్విని నక్షత్రం నాడు వచ్చే వరకు వేచి ఉండాలని అక్కర లేదు. అశ్విని నక్షత్రం నాడు 10000 సార్లకు తగ్గకుండా శివనామ జపం ఉచ్చరించిన తరువాత పాలు పట్టటంవల్ల పిల్లలకు అపరిమితంగా చురుకుతనమూ బలమూ దొరుకుతాయి అనేదే మాట.

విలయినప్పుడెల్లా శివనామ జపం 10000 సార్లు ఉచ్చరించి పాలు ఇవ్వడం వల్ల విశేషమైన ఫలాలు కుదురుతాయి.

పిల్లలకు మొదటి ఆహారం ఇచ్చే అన్న ప్రసానం సమయంలోనూ అశ్విని నక్షత్రం నాడు శివనామం 10000 సార్లకు తగ్గకుండా జపించి ఆహారం తినిపించాలి. అందుచేత పిల్లలకు కావలసిన శక్తులు ఆహారం ద్వారా పొందడానికి భగవంతుడు అనుగ్రహం చేస్తారు.

మొట్టమొదటిగా పిల్లలకు వస్త్రాలు వేస్తున్నప్పుడు, వస్త్రాలను మృగశిర నక్షత్రం నాడు వెయ్యాలి. మొదట పత్తి వస్త్రాలు మాత్రమే వెయ్యాలి.

బోగరు : దేవుడా ! మృగశిర నక్షత్రం నాడు ఎందుకు నూతన వస్త్రాలు వేయాలి ?

అగస్త్య : మృగశిర నక్షత్రం నాడు నూతన వస్త్రాలను పిల్లలకు వేయడంవల్ల పిల్లలకు శరీరంలో దీర్ఘ సుందరా అనే దేవిని అనుగ్రహంతో స్వీయ గౌరవాన్ని కాపాడుకోవడం అనే ఆలోచన చిన్నతనం నుండే ఎదుగుతుంది. ఇలా చెయ్యడం వల్ల భవిష్యత్తులో గౌరవం కోల్పోయి తిరుగాడరు.

గంగకు పిల్లగా భీష్ముడు జన్మించిన తరువాత మృగశిర నక్షత్రం నాడు గంగాదేవి భిష్ముడుకు వస్త్రాలు వేసింది. చివరి వంకు పేరు ప్రతిష్ఠతో ఉండి లోకం ప్రశంసించే ఉత్తముడుగా స్వీయ గౌరవాన్ని కాపాడుకొంటూ జీవించారు.

పిల్లలు పెద్దవారుగా ఎదిగినప్పుడు కూడా మృగశిర నక్షత్రం నాడు నూతన పస్త్రాలు ధరించడం అలవాటు చేసుకోవాలి. దీనితో దీర్ఘ సుందరా దేవిని పూర్ణ కృపాకటాక్షం పొంది మంచి జీవితం కుదురుతుంది.

కేశాలు తీయడమూ కర్ణభూషణమూ

గర్భం నుండి పెరిగిన కేశాలు దేవ కేశాలుగా పరిగణించబడతాయి. వాటిని భగవంతునికి సమర్పించటం విశేషం. కేశాలు మూలంగానే భగవంతుడు తన శక్తిని పిల్లల శరిరంలోపలకి పంపి మేదడు పెంపుతాడు. అందుచేత తొలి కేశాలను దేవునికి సమర్పించడం ప్రతి మానవుడి కర్తవ్యం అవుతుంది.

చిత్త నక్షత్రం నాడు తొలి కేశాలు తీసి కర్ణ భూషణం చేయడంవల్ల పిల్లల భుద్ధి వృద్ధి అవుతుంది.

పిల్లలను పాఠశాల్లో చేర్చడం, కొత్త పాఠలు ప్రారంభించటం, ఇంట్లో తల్లి తండ్రులు కొత్త పాఠలు చదువు చెప్పడం, ఎటువంటి కొత్త పాఠలను నేర్పడం వంటి కార్యాలన్నిటినీ అశ్విని, రోహిణి, ఆరుద్ర, పునర్వసు నక్షత్ర రోజుల్లో ప్రారంభించాలి.

ఈ నక్షత్రాల నాడు ప్రారంభించే చదువు అవలీలగా మనస్సులో ముద్రం అవుతుంది. పిల్లలు జటిల విషయాలను కూడా సులభంగా అవగాహనం చేసుకోగల శకితిని ఈ నక్షత్రాల అనుగ్రహం ద్వారా పొందుతారు. అందుచేత పిల్లలు మంచి చదువు పొందడానికి తగిన నక్షత్ర రోజుల్లో కొత్త పాఠలను ప్రారంభం చేయడం తలిదండ్రుల బాధ్యత అవుతుంది.

పెన్ను, పెన్సిలు, నోటు, పుస్తకాలు వంటి వాటిని మొట్టమొదట కొనుగోలు చేయడం, మొదట వ్రాయడం మొదలైనవి ఈ నక్షత్ర రోజుల్లోనే చెయ్యాలి.

బోగరు : గురుదేవుడా ! పిల్లలను పాఠశాల్లో చేర్చడం అశ్విని, రోహిణి, ఆరుద్ర, పునర్వసు నక్షత్ర రోజుల్లో చెయ్యలని అనుగ్రహించారు. ఏ నక్షత్రం నాడు పుట్టిన పిల్లలను ఏ నక్షత్రం నాడు పాఠశాల్లో చేరిస్తే విశేషమైన ఫలాలను పొందగలమనే వివరాలు కూడా దయచేసి చెప్పండి.

అగస్త్య : నా ప్రియ శిష్యుడా ! ఏ నక్షత్రంలో పుట్టిన పిల్లలను ఏ నక్షత్రం నాడు పాఠశాల్లో చేర్చాలి అనే విషయాన్ని ప్రతి తలిదండ్రులు సద్గురు ద్వారానే తెలుసుకోవాలి. కాని మొట్టమొదట పాఠశాల్లో చేర్చేటప్పుడు ఏ నక్షత్ర రోజుల్లో చేర్చ కూడదనే విషయాన్ని ప్రతి తలిదండ్రులు చక్కగా తెలుసుకోవాలి.

గురు, శుక్ర అస్తమయంగా ఉన్నప్పుడు పిల్లలను పాఠశాల్లో చేర్చడం సరి కాదు. కొత్త పాఠాలు ప్రారంభించ కూడదు.

బోగరు : గురుదేవుడా ! అనేకులు తెలియకుండా తమ పిల్లలను తగని నక్షత రోజుల్లో చేర్చి అందుచేత పిల్లలు చదువులో పురోగతి లేక పోవడం గురించి ఎంతో బాధ పడుతారు. వారి పొరపాటుకు తగిన ప్రాయశ్చిత్తాలు ఏమైనా ఉంటే దయచేసి వివరించాలి, గురుదేవుడా !

అగస్త్య : మానవుడి పొరపాటు అన్నిటికీ ప్రాయశ్చిత్తాలు ఇస్తూనే ఉంటే దోషాలూ ప్రాయశ్చిత్తాలూ అవే జీవితం జరుగుతుంది. ప్రాయశ్చిత్తం అనేది తప్పనిసరి పరిస్థితిలో ఒకరి అర్హత మేరకు ఇవ్వవలసిన ఒకటి. అయినపట్టికి పరోపకారార్థం జీవిస్తున్న మన శిష్యుడి వేడుకోలు ప్రకారం ఇక్కడ కొన్ని ప్రాయశ్చిత్త పద్దతులను అందజేస్తాము.

పిల్లలు పుట్టిన
నక్షత్రం
పాఠశాల్లో చేర్చ
తగని నక్షత్రం
పరిష్కారముగా దానం
చేయవలసిన ప్రసాదం
   
 
 
అశ్వినిఉత్తరాఆషాఢ ఉండ్రాలు
భరణి కృత్తిక కొబ్బరి అన్నం
కృత్తికభరణీసెనగల సతాలింపు
రోహిణి ఆరుద్రకొబ్బర అన్నం
మృగశిర జ్యేష్టటొమాటో అన్నం
ఆరుద్ర శ్రవణంచోళాపూరీలు
పునర్వసుజ్యేష్టనిమ్మరస అన్నం
పుష్యమి చిత్త కరివేపాకు అన్నం
ఆశ్లేషశ్రవణమునీరుల్లి పులుసు
మఖకృత్తుకచేతి మురుకు
పూర్వఫల్గణిఉత్తరాఆషాఢపాలు పేని
ఉత్తరఫల్గుణివూర్వఫల్గుణి క్యారట్ అన్నం
హస్తస్వాతిపెరుగు అన్నం
చిత్తరేవతిమిరపకాయ పొడి ఇడ్లి
స్వాతిరోహిణిరవ్వ దోస
విశాఖరేవతి మైసూరుపాకం
అనూరాధమృగశిరనువ్వల అన్నం
జ్యేష్టరోహిణిపులిహోర
మూలఉత్తరఫల్గుణి మసాల్ వడ
పూర్వాఆషాఢఉత్తరఫల్గుణీఇడియాప్పం
ఉత్తరాఆషాఢపూర్వాఆషాఢగుమ్మడి కాయ సాంబారు అన్నం
శ్రవణముశతభిషవెన్పొంగలి
ధనిష్టఆశ్లేషపులుసులు అన్నం
శతభిషహస్తఆప్పం
పూర్వాభద్రఆశ్లేషపూరీలు ఆలూకూర
ఉత్తరాభద్రధనిష్ట మసాల్ దోస
రేవతిహస్తవత్తల్ పులుసులు

ప్రతి తలీదండ్రులు మొట్టమొదట పిల్లలను ఎప్పుడు పాఠశాల్లో చేర్చారు అనే విషయాన్ని వ్రాసి పెట్టడం అవసరం. చేర్చ వలసిన నక్షత్రం నాడు గురించి పొరపాటు కలిగి ఉంటే దానికి కావలసిన పరిష్కారాలను తలిదండ్రులే నిర్వర్తించాలి. ఇలా తప్పు నక్షత్ర దినాల్లో పాఠశాల్లో చేర్చి ఉంటే, పిల్లలు అశ్రద్దతోనూ, చదువులో ఆసక్తి లేకుండా, పాఠశాలకు పోతాను అని అల్లరిచిల్లరిగా తిరగటం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయరాల పట్ల మర్యాద లేకుండా ప్రవర్తించి చదువు పాడు చేసుకోవడం, చెడు సహవాసాలు వంటి దోషాలు కుదురుతాయి. ఈ విషయాలను గురించి బాగా తెలుసుకోవడానికి సత్సంగం అవసరం.

పిల్లలకు సాధారణ పూజ పద్దతులను నేర్పించి, పైన చెప్పిన ప్రసాదాలను తలిదండ్రులే ఇంచ్లో తయారు చేసి కోవెల్లో దానం చెయ్యాలి. ఆ బిడ్డ చదువు పూర్తి అయ్యే వరకూ వారం ఒక సారి పిల్ల పాఠశాల్లో చేరిన నాడు దానం కోసం ఎంచుకోవాలి. మీది చదువు, పై చదువు సంబంధించిన విషయాల గురించి సద్గురువును ఆశ్రయించి తెలుసుకోవడం మంచిది.

బోగరు : గురుదేవుడా ! పిల్లలకు నామకరణం చేసే పద్దతులు ఏమానా ఉన్నాయా ?

అగస్త్య : కచ్చితంగా. పిల్ల పుట్టిన నక్షత్రం పాదాలకు తగిన అక్షరం తొలి అక్షరముగా ఉన్నట్టు నామకరణం చెయ్యాలి. పుట్టిన తేధీ సంఖ్య నామ సంఖ్యకు విరోధ భావం లేకుండా ఉంటడం శుభకరం.

బోగరు : గురుదేవుడా ! అలాగే, ప్రతి పాఠకు తగిన నక్షత్ర పద్దతులు కూడా ఉన్నాయా ?

అగస్త్య : అవును బోగా. గణితశాస్త్రములో పిల్లలు దిట్టలుగా రాణించాలంటే భరణి నక్షత్రం నాడు గణితశాస్త్ర పాఠలను చదువు చెప్పాలి.

భరణి, కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, పూర్వఫల్గుణి మొదలైన నక్షత్ర రోజుల్లో అభ్యాసములనూ, ఆచరణాత్మక దృష్టాంతాలనూ విడవకుండా సాధిస్తూ ఉంటే విజయం కుదురుతుంది. వర్తకం సంబంధించిన పాఠలకు ఈ నక్షత్రాలే తగినవి.

ఆంగ్లం తదిదర పరాయి భాషలు నేర్చుకోవడానికి అశ్విని, పునర్వసు, పుష్యమి మొదలైన నక్షత్రం నాడు పాఠలు మొదలుబెట్టి చేస్తూ ఉంటే పిల్లలు మంచి పురోగతి పొందుతారు.

Physics, Chemistry వంటి పాఠలు నేర్చడానికి ఆశ్లేష, మఖ నక్షత్ర రోజులు తగినవి.

అన్నీ శాస్త్రాలను (science subjects) నేర్చుకొవడానికి పూర్వఫల్గుణి, ఉత్తరఫల్గుణి నక్షత్ర రోజులు గొప్పవి.

కంప్యూటరు సైన్సు నేర్చుకోనేవారు హస్త, స్వాతి నక్షత్ర రోజుల్లో ప్రారంభించి నేర్చుకోవడం మంచిది.

దేశ చరిత్ర, భూగోళ శాస్త్రం (History, Geography) పాఠలు జ్యేష్ట, మూల నక్షత్రం నాడు ప్రారంభించి చదువుకొవడం మంచిది.

Engineering, Medical Science (Doctors) పాఠలను శ్రవణము నక్షత్రం నాడు ప్రారంభించి చదువుకోవడం మంచిది.

చట్ట చదువు (Law) చేసుకొవడానికి స్వాతి, విశాఖ, అశ్విని, రోహిణి, మృగశిర నక్షత్ర రోజుల్లో ప్రారంభించడం మంచిది.

బోగరు : గురుదేవుడా ! పిల్లలు తమ చదువులోను మాత్రమే గాక జీవితంలోనూ తెలివైనవారుగా ఉండడానికి ఏం చెయ్యాలి ?

అగస్త్య : వారం ఒక సారైనా పిల్లలను కూర్చోబెట్టి నవగ్రహ శాంతి పూజలను నిర్వర్తించాలి. లేదా పూర్వాభద్ర, ఉత్తరాభద్ర నక్షత్ర రోజుల్లో నవగ్రహ శాంతి పూజలు చెయ్యాలి. అందుచేత నవగ్రహాలు మనకు సహాయంగా ఉండి పిల్లలు మంచి భుద్ధితోనూ దిట్టలుగా జీవించడానికి అనుగ్రహిస్తాయి.

నవగ్రహాలకు తగిన 108 నామాలను ఉచ్చరించి నమస్కారం చేయడం సులభమైన నవగ్రహ పూజ అవుతంది.

పిల్లలకు వాహనాలు తీసుకోవాలంటే (tricycle, bicycle, two wheelers) పునర్వసు, స్వాతి వంటి నక్షత్ర రోజుల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. భద్రంగా ప్రయాణం చేయడానికి ఈ నక్షత్రాలు సహకరిస్తాయి. వారి పురోగతికి కూడా అవి తోడు అవుతాయి.

పిల్లలు జబ్బు పడితే రోగాల నుండి త్వరగా నివారణం పొందడానికి అశ్విని నక్షత్రం నాడు మందులు ఇవ్వడం మంచిది.

మృగశిర, ఆరుద్ర, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధా రోజుల్లో పిల్లలు నియమప్రకారం నూనెలు, తైలం రాసి స్నానం చేస్తూ ఉంటే అంతగా రోగాలు రావు. స్నానాంతరం సాంభ్రాణి ధూపం వేస్తే ఎటువంటి రోగాలూ దోషాలూ పిల్లలను తాకవు.

పిల్లలు foot ball, cricket వంటి ఆటలూ, యంత్రాలను జరపడం (treddle, sewing machine, etc.) computer operationss వంటి వాటిని ప్రారింభించడానికి హస్త, చిత్త, ఉత్తరాఆషాఢ, శ్రవణము, రేవతి నక్షత్ర రోజులు శుభకరం.

Typewriting, shorthand, photography, driving వంటి కార్యాలను ఈ నక్షత్ర రోజుల్లోనే ప్రారంభంచి చేయాలి.

Agriculture subject చదివేవారు, పువ్వుల చెట్టులు అమర్చడం, చెట్టులు నాటడం, తోటలు నిర్మాణం చేయడం వంటి వాటిని అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధా నక్షత్ర రోజుల్లో ప్రారంభించి చెయ్యాలి.

గీతం, నృత్యం, వాయిద్యాలను వాయించడం వంటి వాటిని శతభిష, ఉత్తరాభద్ర, రేవతి, శ్రవణము, అనూరాధా, స్వాతి, చిత్త, హస్త, ఉత్తరఫల్గుణి నక్షత్ర రోజుల్లో ప్రారంభించి చేయాలి.

బోగరు : గురుదేవుడా ! పిల్లలు ఆరోగ్యముగా ఎదగడానికి ఎటువంటి ఆహారాలను వారికి తినిపించాలో వివరించమని కోరుతాము.

అగస్త్య : పిల్లల శరిరాన్ని మనస్సును బాగా పెంచగల అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. వాటిని తగిన నక్షత్ర రోజుల్లో స్వీకరించడం వల్ల పిల్లలూ పెద్దలూ ఎంతో మంచి ఫలాలు పొందుతారు.

నక్షత్ర నాడు స్వీకరించవలసిన ఆహారాలు ఫలాలు
   
 
 
అశ్విని చిన్నారులకు సరస్వతి ఆకు పొడి, అలర్కశాకం పొడి, కరివేపాకు పొడి మూడూ కలిసిన ఆహారం జ్ఞాపక శక్తిని పెంచుతంది
భరణి కరివేపాకు అన్నం అలసట తొలగి పోతుంది
కృత్తిక అవిశ కూర పిండిన అన్నం ఉచ్చారణలో స్పష్టత వస్తుంది
రోహిణి మునగాకుల అన్నం మాత్రుభాష తప్ప ఇతర భాషలను నేర్చగల సామర్థ్యం పెరుగుతుంది
మృగశిర వేప వువ్వుల పచ్చడి అన్నం. పిల్లల వయసు మేరకు నేతితో కలిసి మూడు చిన్న ముద్దలు ఇయ్యవచ్చు విన్నవి గ్రహించగల శక్తి పెరుగుతుంది
ఆరుద్ర బిల్వాకు 5, మిరియాల పొడి, ఒక వెల్లుల్లి ఈ మూడును కొంద నేతిలో వేయించి
అన్నంతో కలిసి పిండి 12 ముద్దులు పాఠశాల చిన్నారులకు ఇవ్వండి
చదువులో గందరగోళం రాదు
పునర్వసు అలర్కశాకం (ఉచ్చింత ఆకు) పొడి పిండిన అన్నం. కనీసం మూడు ముద్దులు
ఇవ్వండి
మరిచి పోరు. చదివినవి జ్ఞాపకానికి తీసే శక్తి పెరుగుతుంది
పుష్యమి బచ్చలి కూర పిండిన అన్నం అక్షరంలో స్పష్టత రావడనికి దారిస్తుంది
ఆశ్లేష నూన లేని ఆహారాలు వ్రాయడంలోని తప్పులు తగ్గి పోతాయి
మఖ కాకరకాయ పొడి అన్నం. కనీసం మూడు మూద్దులు ఇవ్వండి నిద్రలో మెలి పెట్టటం, కేకలు వేయటం తగ్గి పోతుంది
పూర్వఫల్గణి బూడిత గుమ్మడికాయి హల్వా, సరైన పరిమాణంలో ఇవ్వండి సుదీర్ఘ భుద్ధి వృద్ది పొందవచ్చు
ఉత్తరఫల్గుణి పొన్నగంటికూర పిండిన అన్నం పాఠలు అవగాహన చేసుకోగల శక్తి కలిగే అవకాశాలు వస్తాయి
హస్త దూర్వా పొడి అన్నంలో కలిసి పిండి 3 లేదా 4 ముద్దలు ఇవ్వండి పాఠలు కంఠస్తం చేసే శక్తి వస్తుంది
చిత్త అరటి దూట ఆహారం - పెసరపప్పు, వేపుడు కూర ఆడ పిల్లలకు మాట్లాడే సామర్థ్యం అధికం అవుతుంది
స్వాతి తోటకూర ఆహారం ప్రశ్నలనూ సమాధానాలనూ పోల్చిచూసుకొనే సామర్థ్యం ఎదుగుతుంది
విశాఖ పప్పు కూర చిలికి అన్నంలో పిండి ఇవ్వండి ఆట సామర్థ్యం అధికం అవుతుంది
అనూరాధ చికిలింత కూర వేపుడు రక్త ప్రసరణను కచ్చితంగా అమర్చి త్వరగా కార్యాలను చేయకుండా ఉండటానికి దారిస్తుంది
జ్యేష్ట పుదీనా కూర చట్ని పిల్లలు చదువులో త్వరితం లేకుండా సమభావంతో అండే స్థతి ఇస్తుంది
మూల కొత్తిమీర చట్ని గణిత పట్టికలు కంఠస్తం చేయడానికి చింతనా శక్తి కలుగుతుంది
పూర్వాఆషాఢ బెండకాయ కర్రి చర్చలో నిదానం వస్తుంది
ఉత్తరాఆషాఢ తేనెలో నానబెట్టిన అల్లం అధికంగా చదివితే వేడి ఎక్కకుండా వేడిని సమానంగా పెట్టుతుంది
శ్రవణము వెల్లుల్లి రసం లేదా ఉల్లిపాయలను సున్నితంగా కోసి పెరుగులో నానబెట్టి తినటం చూచినవి గ్రహించగల శక్తి పెరుగుతుంది
ధనిష్ట పాల్లో తేనె కలిసి కనీసం మూడు సార్లైనా త్రాగాలి చదువుతున్నవారికి కావలసిన శరీర విశ్రాంతి కలిగి కొత్త శక్తి పొందుతారు
శతభిష తేనెలో నానబెట్టిన అంజీర పండ్లు (పెద్దవి) పాత పాఠలు గుర్తుకొస్తాయి. పెద్దలకు పాత అలోచనాలు జ్ఞాపకానికి వస్తాయి.
పూర్వాభద్ర తేనెలో నానబెట్టిన పెద్ద ఉసిరికాయలు సమయోచిత భుద్ధి ఎదగడానికి దారిస్తుంది
ఉత్తరాభద్ర తెల్ల లేదా ఎర్ర ముల్లంగి రసం ఆహారంలో కలుసుకోండి కలుసుకుంటూ ఆలోచన చేసే సామర్థ్యం పెరుగుతుంది
రేవతి పాల్లో వేయించిన వెల్లుల్లి లేదా నేతితో మిరియాలు కలిసి వేడు చిసిన వెల్లుల్లి వేగంగా ప్రాయ వచ్చు

పైన చెప్పిన ఆహార పదార్థాలను పిల్లల వయసు, కోరిక మేరకు, సిద్ధ వైద్యలు, పెద్దలను సంప్రదించి జాగ్రత్తగా, కావలసిన పరిమాణంలో ఇవ్వండి. ఎదిగినవారూ ఈ ఆహార అలవాటు పాటించి గొప్ప ఫలాలు పొంద వచ్చు.

ఓం గురువు శరణం

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam